• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అట్లాంటాలో విశ్వ సదస్సు ఉత్సవాలు

By Pratap
|

NRIVA has kicked off its global convention celebrations in Atlanta
అట్లాంటా: ఎన్నారై వాసవీ అసోసియేషన్ రెండవ అంతర్జాతీయ వేడుకలకు జార్జియా రాష్ట్రం లోని అట్లాంటా నగరంలో ఫిబ్రవరీ 2 వ తేదీన ఘనంగా శ్రీకారం చుట్టారు. స్నేహం, ధర్మం, సచ్ఛీలం వంటి ఉత్తమ గుణాలను ప్రధానంగా పాటిస్తూ సేవా తత్పరతతొ ఆనంద్ గార్లపాటి, విజయ చావ్వ నాయకత్వంలో 2007 వ సంవత్సరంలో ఏర్పడింది. దిన దిన ప్రవర్థమానమై అమెరికాలోని 25 రాష్టాలకు విస్తరించింది. 2013 ఆగస్ట్ 31 వారాంతంలో జరుగబోవు వేడుకలకు లీడర్‌షిప్ టీమ్‌ను, నూతన కార్యవర్గ టీమ్‌ను, బోర్డ్ ఆఫ్ డైరక్టెర్స్‌ను, సలహా సంఘాన్ని కుడా సభకు పరిచయం చేశారు.

ఈ కార్యక్రమానికి 300 మందికి పైగా హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల నుంచి 100 మందికి పైగా విచ్చేసిన అతిధులతో, సాంస్కృతిక కార్యక్రమాలతో రంగ రంగ వైభవంగా జరిగింది. 200000 డాలర్లు విరాళాలు ప్రకటించిన దాతలకు సంస్థ ఛైర్మన్ ఆనంద్ గార్లపాటి, నూతన అధ్యక్షుడు రమేశ్ కల్వాలా, 2వ గ్లోబల్ కన్వెన్షన్ కు కన్వీనర్ హనుమాన్ నందనంపాటి ధన్యవాదాలు తెలియచేశారు.

అనంతరం ఈ వేడుకలకు వేదికగా ఎంచుకున్న జార్జియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (జిఐసిసి)ని న్యూ జెర్సీ, వాషింగ్టన్, మిచిగన్, సేంట్లూయిస్, షికాగో, చార్లెట్, కాలిఫోర్నియా, ఒహాయో, ఓర్లాండ్, తదితర ప్రాంతాలనుంచి వచ్చిన అతిధులందరితో కలిసి పరిశీలించారు. హనుమాన్, ఇతర కన్వెన్షన్ లీడర్‌షిప్ టీమ్, ఈ వేడుకలలో పాల్గొనేందుకు కావలసిన వివరాలతో పాటు నూతన వెబ్‌సైట్ ను ప్రారంభించారు. టాలెంట్ సెర్చ్‌లో భాగంగా అన్ని చాప్టర్స్ లోను పోటీలు నిర్వహించి విజేతలకు గ్లోబల్ కన్వెన్షన్ లో బహుమతి ప్రధానం చేస్తారు. త్వరలో ఎన్నారైవీయే కార్యవర్గ టీమ్ దీనికి సంబంధించిన వివరాలతో ఒక ప్రకటన విడుదల చేయనుంది.

ఛైర్మన్ ఆనంద్ మాట్లాడుతూ - వాషింగ్టన్ డిసీలో జరిగిన మొదటి గ్లోబల్ కన్వెన్షన్ కంటే ప్రతిస్పందన ఎక్కువగా కనిపిస్తోందని, కనీసం ౩౦౦౦ మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉందని తెలియ చేశారు. కన్వెన్షన్ లీడర్‌షిప్ టీమ్ లోని చిట్తారీ పబ్బ, శ్యామ్ పదమటింటి మాట్లాడుతూ - త్వరలో మిగతా చ్యాప్టర్స్లో కూడా కన్వెన్షన్ రోజు పేరుతో ఫండ్ రైజింగ్ ప్రోగ్ర్యామ్స్ చేస్తామని చెబుతూ అందుకు కావలసిన సహాయ సహకారాలను అందించవలసినదిగా కోరారు. అట్లాంటాలో కన్వెన్షన్ చేయటానికి అవకాశం కలిగించినందుకు, తమపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిచేశారు.

అధ్యక్షుడు రమేశ్ మాట్లాడుతూ - మిగతా కార్యచరణ వివరాలను అందరికి వివరిస్తామని, అన్ని చాప్టర్స్ నుంచి సహకారాన్ని ఆశిస్తూ, కిక్ ఆఫ్ మీటింగ్ నే ఇంత ఘనంగా నిర్వహించిన టీమ్ అట్లాంటాను, సభకు విచ్చేసిన లోకల్ అతిధులకు, వాలంటీర్లకు, నూతన కార్యవర్గ సభ్యులకు, బోర్డ్ ఒఫ్ డైరెక్టర్స్ కు, సలహా సంఘ సభ్యులకు, ఇతర అతిధులకు ధన్యవాదాలు తెలియచేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
NRIVA which was formed to spread and establish Dharma Sheelam Ahimsa in the society in the year 2007 has kicked off its global convention celebrations in Atlanta on February 2
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more