వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అబార్షన్లపై ఎన్నారై డాక్టర్ సస్పెన్షన్

By Pratap
|
Google Oneindia TeluguNews

USA
లండన్: లింగ నిర్దిష్టతను ఆధారం చేసుకుని అబార్షన్లు చేస్తున్న ఎన్నారై డాక్టర్‌ వ్యవహారంపై యునైటెడ్ కింగ్‌డమ్‌లో విచారణ జరుగుతోంది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఆరోగ్య కార్యదర్శి ఆండ్ర్యూ లాన్స్లే పోలీసుల దర్యాప్తునకు ఆదేశించారు.

శిశు లింగాన్ని నిర్ధారించుకుని అబార్షన్లు చేసిన విషయాన్ని కన్సల్టెంట్ ప్రభా శివరామన్, మరో డాక్టర్ దర్యాప్తులో అంగీకరించారు. ఈ చర్యలకుగాను వారిని సస్పెండ్ చేశారు. అబార్షన్లు చేయడానికి తప్పుడు పత్రాలను సృష్టించినట్లు కూడా వారు అంగీకరించినట్లు డైలీ మెయిల్ పత్రిక రాసింది. శివరామన్ మాంచెస్టర్‌లోని ఎన్‌హెచ్ఎస్ ఆస్పత్రుల్లోనూ ప్రైవేట్ క్లినిక్స్‌లోనూ పనిచేస్తున్నారు.

ఆడ శిశువును గర్భం నుంచి తీసేయాలని కోరిన ఓ యువతితో - తాను ప్రశ్నలను అడగనని, అబార్షన్ కావాలంటే చేయించుకోవాలని ఆమె చెప్పింది. తనకు ఫ్రాన్స్‌లో రక్త పరీక్షలు జరిగాయని, తన కడుపులో ఆడశిశువు ఉందనేది నిర్ధారణ అయిందని యువతి చెప్పింది.

అబార్షన్ కోసం ప్రైవేట్ రోగికి కొన్ని పద్ధతులు ఉన్నాయని, దాని ప్రకారం సొమ్ము చెల్లించాలని శివరామన్ ఆ యువతికి చెప్పారు. సామాజిక కారణాలు చెబుతూ ఎన్‌హెచ్ఎస్‌లో ప్రోసీజర్ బుక్ చేశారు. ఆ రకంగా లింగ ప్రాతిపదికపై అబార్షన్లు చేస్తూ వస్తున్నారని దర్యాప్తులో తేలింది.

English summary
An Indian doctor is being investigated for carrying out sex selective abortions in the UK. An "extremely concerned" health secretary Andrew Lansley asked the police to investigate the matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X