వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖండాంతరాల్లో టీఆర్ఎస్ వ్యాప్తి .. 40 దేశాల్లో ఎన్ఆర్ ఐ శాఖల ఏర్పాటు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : గులాబీ పార్టీ ఖండంతరాల్లో వ్యాపిస్తోంది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆవిర్భవించిన టీఆర్ఎస్ .. విదేశాల్లో శాఖల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 40 దేశాల్లో ఎన్ఆర్ ఐ శాఖలు ఏర్పడినట్టు టీఆర్ఎస్ ఎన్నారై వ్యవహారాల బాధ్యురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు.

ప్లీనరీలోపు దశదిశాల విస్తరణ

ప్లీనరీలోపు దశదిశాల విస్తరణ

ఏటా ఏప్రిల్ లో టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహిస్తారు. ఈ ఏప్రిల్ 27 లోపు 100 శాఖలు ఏర్పాటుచేస్తామన్నారు కవిత. మంగళవారం కవిత నివాసంలో ఆమెను టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల కలిశారు. ఈ సందర్భంగా కొత్త ఎన్నారై శాఖల ఏర్పాటు, శాఖల పని తీరు, కార్యకలాపాలపై పలు సూచనలు చేశారు.

మొత్తం 40 శాఖలు

మొత్తం 40 శాఖలు

ఇటీవలే ఏర్పడిన కెనడా దేశం టీఆర్ఎస్ శాఖతో కలిపి మొత్తం 40 దేశాల్లో టీఆర్ఎస్ ఎన్నారై శాఖలు ఏర్పాటయ్యాయి అని మహేష్ బీగాల వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా టీఆర్ఎస్ శాఖలు, గులాబీ జెండాలు రెపరెపలాడాలని, ఆ దిశగా కార్యాచరణ రూపొందించాలని ఈ సందర్భంగా కవిత సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై దేశవ్యాప్తంగా ప్రశంశలు వస్తున్నాయని, పార్టీని విదేశాల్లోనూ బలపడెలా చూడడం మన బాధ్యత అన్నారామె.

దేశం చూపు .. తెలంగాణ వైపు ...

దేశం చూపు .. తెలంగాణ వైపు ...

దేశమంతా తెలంగాణ వైపు చూస్తున్నదని చెప్పారు కవిత. పరిపాలన, అభివృద్ది, సంక్షేమంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్నారై బాధ్యులు ప్రత్యక్షంగా, పరోక్షంగా టిఆర్ఎస్ మిషన్ లో భాగస్వాముల అయి పార్టీని మళ్లీ అధికారంలోకి తీసువచ్చెందుకు కృషి చేశారని అన్నారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ ఎన్నారై బాధ్యులను ప్రశంసిస్తూ, వారికి అభినందనలు తెలిపారామె.

భయంకర వ్యాధిని గెలిచాడు .. జన్యు పోలికల శస్త్రచికిత్సతో హెచ్ఐవీ దూరం ...<br />భయంకర వ్యాధిని గెలిచాడు .. జన్యు పోలికల శస్త్రచికిత్సతో హెచ్ఐవీ దూరం ...

అడ్ హక్ కమిటీ ఏర్పాటు

అడ్ హక్ కమిటీ ఏర్పాటు

కెనడాలో టిఆర్ఎస్ కార్యకలాపాల పర్యవేక్షణ కోసం అడ్ హక్ కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు కవిత. అడ్ హక్ కమిటీని వేసిన తర్వాత పూర్తి స్థాయి కమిటీని వేద్దామన్నారు .

కెనడా అడ్ హక్ కమిటీ

కెనడా అడ్ హక్ కమిటీ


కృష్ణ కోమండ్ల, ప్రభాకర్ తూము, సంపత్ బాలమొని, సాయి రామకృష్ణ కంటే, సతీష్ వీరవెల్లి, చేతన్ కొరబోయిన, శ్రీనాథ్ కుందూరు, కరుణాకర్ పీచర, మహ్మద్ యార్ఖాన్ లతో అడ్ హక్ కమిటీని ప్రకటించారు.

English summary
The NRIs were formed in 40 countries and the TRS was responsible for Nizamabad MP kavitha. The TRS plenary is conducted pleanary in April. Kavita said 100 branches would be set up by April 27. On Tuesday, she met TRS Nair coordinator Mahesh Bigala. On this occasion, new NRI departments have been set up and various suggestions on the work and activities of the branches.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X