వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాక్రమెంటొలో దిగ్విజయంగా 5కె రన్/వాక్ కార్యక్రమం..

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: తానా ఫౌండేషన్ సౌజన్యంతో "బ్యాక్ టూ ద రూట్స్ స్వచ్ఛంద సంస్థ" నేతృత్వంలొ కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని నగరం శాక్రమెంటొలో 5కె రన్/వాక్ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది.

ఆదివారం మే 13వ తేదీ ఉదయం 8.30గం.కు 250మందికి పైగా పొటీదారులతో 5కె రన్‌ను సీతారాం కర్నాటి, శాక్రమెంటొ తానా ప్రతినిధి, వినయ్ పరుచూరి, తానా పశ్చిమ అమెరికా 5కె రన్ కోఆర్డినేటర్, సతీష్ వేమూరి, తానా కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్, నటరాజన్ గుత్తా, జితేంద్ర మరియూ భాస్కర్ వెంపటి, "బ్యాక్ టూ ద రూట్స్ స్వచ్ఛంద సంస్థ" ప్రతినిధి 5కె రన్/వాక్ ను లాంఛనంగా ప్రారంభించారు.

5k run in sacramento to support back to the root organization

ఉభయ తెలుగు రాష్ట్రాలలో "బ్యాక్ టూ ద రూట్స్ స్వచ్ఛoద సంస్థ" నిర్వహిస్థున్న పలు కార్యక్రమాల సహాయార్ధం ఈ 5కె రన్‌ను నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి భాస్కర్ వెంపటి తెలిపారు.

ఈ సందర్భంగా భాస్కర్ మరియూ తానా ప్రతినిధులు "బ్యాక్ టూ ద రూట్స్ స్వచ్ఛంద సంస్థ" మరియూ తానా "మన ఊరికోసము" కార్యక్రమాల అమలు గురుంచి కాలిఫోర్నియాలో తెలుగు వారికి అవగాహన కల్పించటంతోపాటు ఇక్కడి తెలుగువారికి వ్యాయామంపై కూడా అవగాహన కల్పించేందుకు శాక్రమెంటొ లొ 5కె రన్‌ను నిర్వహించినట్లు తెలిపారు.

5కె రన్ కారణంగా ఆనందం, ఆరోగ్యం సాకారం అవుతుంది అని భాస్కర్ వెంపటి అన్నారు. 5కె రన్ ద్వారా శరీరం, ఆరోగ్యంగా ధృడంగా ఉంటుందని, ప్రతిఒక్కరు ఆరోగ్య నియామాలు పాటించాలని ఆయన సూచించారు. సంకల్పబలం ఉండే ఏదైనా సాధించవచ్చునని ఆయన అన్నారు. 5కె రన్ కార్యక్రమం ఒక మంచి కార్యక్రమంగా పలువురు పొటీదారులు అభివర్ణించారు.

అనంతరం 5కె రన్ కార్యక్రమంలో గెలుపొందిన వారికి నిర్వాహకులు షీల్డ్స్ అందచేశారు. అదేవిధంగా 5కె రన్ వంటివి మరిన్ని జరపాలని పలువురు సూచించారు. ఈ 5కె రన్‌లో శాక్రమెంటో శివారు పాఠశాలల నుండి పెద్దఎత్తున విద్యార్థులు, పెద్దలు ఆనందంగా కేరింతలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

బ్యాక్ టూ ద రూట్స్ శాక్రమెంటొ శాఖ తెలంగాణా రాష్ట్రంలో అష్టగుర్తి అనే గ్రామాన్ని దత్తతకు తీసుకొని అనేక సేవా కార్యాక్రమాలను నిర్వహించింది అని, అంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక గ్రామాన్ని త్వరలొ దత్తత తీసుకోనుందని భాస్కర్ చెప్పారు. యువకుల్లో సంఘంపట్ల బాధ్యత ను పెంపొందించదం, కుటుంబం పట్ల శ్రద్ధ, ఆరోగ్యం, వయోజన విద్య, సేంద్రియ (ఆర్గానిక్) వ్యవసాయం పట్ల అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను బ్యాక్ టూ ద రూట్స్ చేపట్టిందని భాస్కర్ చెప్పారు.

మరిన్ని వివరాలకు ఈ వెబ్ సైటును సంప్రదించవలసిందని ఆయన సూచించారు : http://www.backtotherootsproject.org/progress

కాలిఫోర్నియా శాక్రమెంటో లో 5 కె రన్ విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేసిన వారిలో ఉదయ్ రావులపల్లి, రాఘవ నారపురెడ్డి, సంతోష్ గంగ, వందన శర్మ, నగేష్ చంద్ర, నాగ్ దొండపాటి, నాగేంద్ర పగడాల, వికాష్ కపాడియా,భవాని రావులపల్లి, శ్రీలు ఉప్పాల, అక్షత నాడిగ్, అశ్విన్ నరసింహం,

వత్సల భార్గవ, వేణు ఆచార్య, వేణు మల్లెసర, సుందర్ రాజన్, రామ్ రాజ్, మల్లిక్ సజ్జనగాండ్ల, కృష్ణ బాచిన, ప్రసాద్ నల్లూరి, సిద్ధారెడ్డి, హరిమోహన్ అన్నారెడ్డి, ఫాల్స్o మనబడి, రొజ్ విల్ మనబడి, వెంకట్ నాగం, రాగా గణేషన్, కేయూష్ షా, కాంచన, నీల్ ఇస్రనీ, వినాయక్ పాటిల్, వై కే చలం, లక్ష్మీ రావు, స్వాతి పాటిల్ వంటి కార్యకర్తలు ఉన్నారు.

English summary
Over 250 of Local Telugu People have participated in 5K Run/Walk on Sunday May 13th 2018 to support Back to the Root Organization at Sacramento, California State, USA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X