వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

20 ఏళ్ల క్రితం భూకంపంతో ఆస్తి, ప్రాణ నష్టం ఎంతో తెలుసా..!!

|
Google Oneindia TeluguNews

రిజ్డ్ క్రెస్ట్ : భారీ భూకంపంతో కాలిఫోర్నియా వణికిపోయింది. దక్షిణ ప్రాంతంలో తీవ్ర ప్రభావం చూపింది. దీంతో 1700పైచిలుకు మంది బిక్కుబిక్కుమంటూ గడిపారు. అయితే 20 ఏళ్లకు ముందు కూడా కాలిఫోర్నియాలో తీవ్ర భూకంపం సంభవించింది. ఆ సమయంలో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. వేల మంది గాయాలతో బిక్కు బిక్కుమంటూ ఆస్పత్రిలో చేరారు.

భూ ప్రకంపనాలు ..

భూ ప్రకంపనాలు ..

కాలిఫోర్నియా, సమీపంలోని లాస్ ఏంజెల్స్‌లో తీవ్ర భూకంపం సంభవించింది. సాన్ ఫెర్నాడో వ్యాలీలో 1994 జనవరి 17న భూమి తీవ్రస్థాయిలో కంపించింది. దాని తీవ్రత అప్పుడ 6.7గా నమోదైంది. దీంతో దాదాపు 57 మంది చనిపోయారు. 7 వేలకుపైగా మంది గాయపడ్డారు. తీవ్ర భూకంపంతో దాదాపు 20 బిలియన్ అమెరికా డాలర్ల ఆస్తి నష్టం వాటిల్లింది. దీంతో అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని జియోలాజికల్ సర్వే పేర్కొన్నది.

 బీభత్సం ..

బీభత్సం ..

10 నుంచి 20 సెకండ్ల పాట్లు తీవ్రస్థాయిలో భూమి కంపించింది. దీంతో ఎక్కడి వస్తువులు అక్కడ చిందర వందరగా పడిపోయాయి. తీవ్రతతో భూమి పగుళ్లు ఏర్పడ్డాయి. భవనాలు కుప్పకూలిపోయాయి. కొన్నిచోట్ల గ్యాస్ లైన్ పైప్ ధ్వంసమై అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. భూకంపం సంభవించిన ప్రాంతం నుంచి కాపాడేందుకు అధికారుల బృందం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. 2010లో కూడా కాలిఫోర్నియాలో 6.5 తీవ్రతతో భూకంపం వచ్చిందని జియాలిస్టులు పేర్కొన్నారు. దీంతో కొన్ని వేళ ఇళ్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

 ఎలా ఉన్నారో ..?

ఎలా ఉన్నారో ..?

కాలిఫోర్నియాలో సాధారణంగా తెలుగు ప్రజలు ఎక్కువగా ఉంటారు. అయితే శుక్రవారం సంభవించిన భూకంపంతో వారి పరిస్థితి ఏమిటనే దానిపై కుటుంబసభ్యులు, బంధువుల్లో ఆందోళన నెలకొంది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.1గా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. భూకంపంతో ఇప్పటికే అత్యవసర పరిస్థితి విధించిన నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారా లేదా అనే సందేహపడుతున్నారు. మరోవైపు రిజ్డ్ క్రెస్ట్ ప్రాంతంలో అధికారుల సహాయ చర్యలు ముమ్మరమయ్యాయి. కాపాడేందుకు ఆయా చోట్ల హట్ లైన్ కూడా ఏర్పాటుచేయడంతో .. సహాయక చర్యలు మరింత వేగవంతం అయ్యాయని అధికారులు చెప్తున్నారు.

English summary
The 6.7 magnitude Northridge earthquake struck Los Angeles' San Fernando Valley on January 17, 1994, killing at least 57 people, injuring more than 7,000 and leaving an estimated $20 billion in damages, according to the US Geological Survey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X