‘అఖిల్’ ఆడియో వేడుకలో అఖిల్ సందడి(పిక్చర్స్)
డల్లాస్: అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన నట వారసుడు అఖిల్ అక్కినేని తొలి చిత్రం ‘అఖిల్' ఆడియో వేడుక అమెరికాలోని డల్లాస్‌లో ఘనంగా జరిగింది. శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగు ప్రవాసులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు.
దాదాపు 1000మందికి పైగా హాజరైన అభిమానులు.. అక్కినేని అఖిల్‌కు కేకలు వేస్తూ, కేరింతలు కొడుతూ ఘన స్వాగతం పలికారు. అఖిల్ తోపాటు అతని తల్లి, నటి అమల, తండ్రి, ప్రముఖ నటుడు నాగార్జున కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.
‘అఖిల్' చిత్రానికి సంగీతం అందించిన సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, నిర్మాత సుధాకర్ రెడ్డి(శ్రేష్ట మూవీస్), గేయ రచయిత కృష్ణ చైతన్యలు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని శ్రీకాంత్ పోలవరపు విజయవంతంగా నిర్వహించారు.
అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా(ఏఎఫ్ఏ) ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర ‘అఖిల్' చిత్రం ఆడియో సీడీలను ఆవిష్కరించారు. తొలి కాపీని అఖిల్‌కు అందించారు. ఆ తర్వాత అనూప్ రూబెన్స్, సుధాకర్ రెడ్డి, కృష్ణ చైతన్య, శ్రీకాంత్ పోలవరపు, సుధీర్ తోడెపు, సుబ్బారావు నీలిశెట్టి, రాజేష్ అడుసుమిల్లి, మురళీ వెన్నం, చలపాటి కొండ్రకుంట, ఇతర అతిథులకు అందజేశారు.
మూడు గంటలపాటు జరిగిన ఈ కార్యక్రమంలో అభిమానులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. రాజేష్ అడుసుమిల్లి, ప్రముఖ టీవీ యాంకర్ గాయత్రి భార్గవిలు వేదికపై వ్యాఖ్యతలుగా వ్యవహరించారు.
కీర్తి చమకూర ఆలపించిన ప్రార్థనా గీతంలో కార్యక్రమం ప్రారంభమైంది. ఆ తర్వాత ‘దేవ దేవం భజే' గీతానికి కూడిపూడి నృత్యం చేశారు. ఆ తర్వాత ఏఎన్నార్, నాగార్జున, అమల నటించిన సినిమాల్లోని పాటలను డల్లాస్ గాయకులు పాడి ఆకట్టుకున్నారు.

అఖిల్
అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన నట వారసుడు అఖిల్ అక్కినేని తొలి చిత్రం ‘అఖిల్' ఆడియో వేడుక అమెరికాలోని డల్లాస్‌లో ఘనంగా జరిగింది.

ఆడియో విడుదల
శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగు ప్రవాసులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు.

ఆడియో వేడుక
దాదాపు 1000మందికి పైగా హాజరైన అభిమానులు.. అక్కినేని అఖిల్‌కు కేకలు వేస్తూ, కేరింతలు కొడుతూ ఘన స్వాగతం పలికారు.

అఖిల్
అఖిల్ తోపాటు అతని తల్లి, నటి అమల, తండ్రి, ప్రముఖ నటుడు నాగార్జున కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.
హర్షిత్ వెన్నం, వరుణ్ కర్రి, నరేన్ యలమంచిలి, రవితేజ చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. శాంతి నూతి నృత్యాలకు దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో డా. ప్రసాద్ తోటకూర సంఘానికి సంబంధించిన పలు విషయాలను తెలుగు ప్రవాసులతో పంచుకున్నారు. 2012లో ఏఎన్నార్ డల్లాస్‌ను సందర్శించిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
కాగా, అఖిల్ అక్కినేని తెలుగు ప్రవాసులందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నారైల ప్రేమాభిమానాలను ఎప్పుడూ మర్చిపోలేనని చెప్పారు. పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలకు అఖిల్ సమాధానాలు చెప్పారు.
పరమేశ్ దేవినేని, వెంకట్ వల్లేటి, హరి నాయుడు మేదరమెట్ల, కుమార్ నందిగాం, లోకేష్ నాయుడు, లక్ష్మీకాంత్ గొర్రెపాటి, సాంబ దొడ్డ, వేణు పావులూరి, దేవి ముండ్లూరి, సత్య రావిపాటి, శేషరావు బొడ్డు, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ శ్రీకాంత్ పోలవరపు కృతజ్ఞతలు తెలిపారు.