• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అట్లాంటాలో ఆటా ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం..

|

అట్లాంటా: దేశవ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా).. అందులో భాగంగా అట్లాంటాలోని హిందూ దేవాలయ ప్రాంగణంలో వైద్య శిబిరాన్ని నిర్వహించింది. సాయి హెల్త్ ఫెయిర్, జార్జియా ఇండియన్ నర్సెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

దాదాపు 250మంది ఈ వైద్య శిబిరంలో స్పెషలిస్టు డాక్టర్ల చేత వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో కొంతమంది ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేయించుకోగా.. మరికొంతమంది ఆటా స్వచ్చంద కార్యకర్తలతో ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

American Telugu Association Health Fair in Atlanta

చాలావరకు వైద్యపరీక్షలను ఉచితంగానే అందించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. రక్త పరీక్షలకు నామమాత్రపు ఛార్జీలు వసూలు చేశారు. బీపీ, షుగర్, కిడ్నీ, కాలేయం, కొలెస్ట్రాల్, ఎలక్ట్రోలైట్స్, లిపిడ్ ప్రొఫైల్, హెచ్.డి.ఎల్, థైరాయిడ్, ఫోలిక్ యాసిడ్, గ్లూకోమా, బీఎంఐ వంటి పరీక్షలను వైద్య శిబిరంలో నిర్వహించారు.

నిపుణులైన న్యూట్రిషియన్స్ డయాబెటిక్, న్యూట్రిషన్, హైపర్ టెన్షన్ పట్ల అవగాహన కల్పించారు. ధూమపానం వల్ల వచ్చే నష్టాలను ఆ రంగంలో నిష్ణాతులైన డాక్టర్లు తెలిపారు. వైద్య పరీక్షలతో పాటు యోగా మాస్టార్ తో ఏర్పాటు చేయించిన యోగా క్లాసులకు కూడా చాలామంది హాజరయ్యారు. వైద్య సంబంధిత కార్యక్రమాలన్ని డాక్టర్ శ్యామల ఎర్రమల్, డాక్టర్ సుజాత రెడ్డి, డాక్టర్ శ్రీని గంగసాని ఆధ్వర్యంలో జరిగాయి. వీరితో పాటు సౌతర్న్ రీజినల్ హాస్పిటల్స్ వైద్యులు సహాయ సహకారాలు అందించారు.

గైనకాలజీ, అర్థోపెడిక్, డెంటిస్ట్, కార్డియాలజీ, ఈఎన్‌టి విభాగాల్లో 20మంది వైద్యుల బృందం సహాయ సహకారాలు అందించింది. కేవలం తెలుగు మాట్లాడే ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల వాళ్లు కూడా ఈ మెడికల్ క్యాంపును ఉపయోగించుకున్నారు.

ఈ కార్యక్రమం విజయవంతం అయిందని అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ బోర్డు ధర్మకర్తలు అనిల్‌ బొడ్డిరెడ్డి, వేణు పిసికె తెలిపారు. చాలా తక్కువ సమయంలోనే వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది ప్రజలు హాజరయ్యారని తెలిపారు. ఆటా అసోసియేషన్‌ ట్రేజరర్‌, ఎగ్జిక్యూటివ్‌ బోర్డ్‌ మెంబర్‌ కిరణ్‌ పాసం మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం వృద్దులకు, విద్యార్థులకు, గాయపడిన వారికి ఎంతో ఉపయోడపడిందని అన్నారు.

అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ అధ్యక్షుడు కరుణాకర్‌ అశిరెడ్డి మాట్లాడుతూ.. ఉచిత వైద్యశిబిరంలో పనిచేసిన డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. సేవ కార్యక్రమాల్లో భాగంగా అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ డిసెంబర్‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉచిత వైద్యశిబిరాలు చేపడుతామని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ రిజనల్‌ డైరెక్టర్‌ తిరుమల్‌ పిట్ట, రిజనల్‌ కో- అర్డినేటర్స్‌ ప్రశాంత్‌ పొద్దుటురి, శ్రావణి రచ్చకుల్లా, శ్రీరామ్‌, శ్రీనివాస్‌, హెల్త్‌ కమిటీ కో చైర్‌ రమణ రెడ్డి బాతుల, స్టాడింగ్‌ కమిటీ చైర్మన్‌లు శివ రామడుగు, నందా చాట్ల, శ్రీధర్‌, అటా వాలంటీర్స్‌లు పాల్గొన్నారు.

English summary
American Telugu Association (ATA), as a part of the countrywide programs of conducting Medical Health Fairs, Health screenings and Disease Awareness Programs, conducted its Health Fair in Atlanta at the Hindu Temple of Atlanta,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X