వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ 'బతుకమ్మ చీర' పథకం చారిత్రాత్మకం: ఎన్నారైల హర్షం, ప్రతిపక్షాల విమర్శలకు ధీటైన జవాబు

పేదింటి సారె బతుకమ్మ చీరెలపైన ప్రతిపక్షాలు చేస్తున్న అమానవీయ చిల్లర రాజకీయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఎన్నారై తెరాస యూకే అధ్యక్షులు శ్రీ అనిల్ కూర్మాచలం.

|
Google Oneindia TeluguNews

లండన్: పేదింటి సారె బతుకమ్మ చీరెలపైన ప్రతిపక్షాలు చేస్తున్న అమానవీయ చిల్లర రాజకీయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎన్నారై తెరాస యూకే అధ్యక్షులు శ్రీ అనిల్ కూర్మాచలం గారు, ఉపాధ్యక్షులు శ్రీ నవీన్ రెడ్డి గారు, కార్యదర్శి & అధికార ప్రతినిధి శ్రీ చాడ సృజన రెడ్డి గారు పత్రిక ప్రకటనలో తెలిపారు.

లండన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో అధ్యక్షులు శ్రీ అనిల్ కూర్మాచలం గారు మాట్లాడుతూ ప్రతి పేదింటి ఆడబిడ్డ కొత్త చీర కట్టుకొని బతుకమ్మ ఆడాలనే గొప్ప ఆలోచనతో మన ముఖ్యమంత్రి కెసిఆర్ గారు తలపెట్టిన చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రజలంతా హర్షిస్తుంటే, ముఖ్యంగా ఆడబిడ్డలంతా మా ఇంటి పెద్దన్న మాకు సారె పంపిండు అని మురిసి కెసిఆర్ గారిని కీర్తిస్తూ ఆశీర్వదిస్తుంటే, ప్రతిపక్షాలు అది జీరించుకోలేక పేదవారి ఇంటికి వచ్చిన సంప్రదాయ సారెను లాక్కొని మరి కాల్చేసి యావత్ సమాజం తల దించుకొనేలా ప్రవర్తించారు.

ఇంతటి దిగజారుడు రాజకీయాల్ని దేశం లో ఎక్కడ చూడలేదని, మనమంతా ఎంతో గౌరవించే చీరను మంటల్లో వేయడమంటే వారి రాజకీయ లబ్ది కోసం సాక్షాత్తు తల్లి లాంటి మన సంప్రదాయాన్ని మంటల్లో వేసినట్టే అని, ఇలాంటి సంస్కార హీనా చర్యల వల్ల ప్రజలకు మరింత దూరం అవడమే తప్ప, వారనుకున్నట్టు దీని వల్ల రాజకీయంగా ఎదిగేదేమి లేదని గుర్తించాలని హితవు పలికారు.

anil kurmachalam on batukamma sarees

రానున్న రోజుల్లో ప్రజలకు తప్పకుండా తగిని బుద్ది చెప్తారని , ఇలాగే ప్రభుత్వం పైన కెసిఆర్ గారి నాయత్వం పైన బురద చల్లె ప్రయత్నం చేస్తే బాధ్యత గల కార్యకర్తలుగా తగిన బుద్ది చెప్తామని హెచ్చరించారు.

ఉపాధ్యక్షులు శ్రీ నవీన్ రెడ్డి గారు మాట్లాడుతూ చీరెల పంపిణి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం అని అన్నారు. ప్రతిపక్షాలు తెలంగాణ ఆడిబిడ్డలకు ఎన్నడూ నుదుట కుంకుమ కూడా పెట్టని వారు నేడు ఇచ్చిన చీరెలు బాలెవ్వు అని గుంజుకొని మంటల్లో వెయ్యడం వారి దిగజాలరుడు తనాన్ని, చిల్లర రాజకీయాన్ని ప్రదర్శిస్తుంది అని అన్నారు.

గత రెండు రోజుల నుండి మేము కూడా క్షేత్రస్థాయిలోని ప్రజలతో మాట్లాడుతూ చీరల పంపిణీ పై వారి అభిప్రాయాల్ని తెలుసుకుంటున్నామని, ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా పండగా రెండు రోజుల ముందే వచ్చిందా అన్నట్టు ఆనందానికి అవధులేనట్టు ఉన్నారని తెలిపారు. ఎన్నారైలుగా ముఖ్యంగా బాధ్యత గల తెరాస కార్యకర్తులుగా మేము కూడా ఎప్పటికప్పుడు వాస్తవాలని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నామని తెలిపారు.

కార్యదర్శి శ్రీ చాడ సృజన రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం ఏర్పడకుండా ఏవైతే శక్తులు అడ్డుపడ్డాయి అవే శక్తులు నేడు తెలంగాణా అభివృద్ధి కాకుండా, తెలంగాణా లో సంక్షేమ పధకాలు అమలు కాకుండా అడ్డుపడుతున్నాయి అన్నారు. కెసిఆర్ గారు ఒక అన్న లెక్క పేదింటి ఆడబిడ్డలకు ౧ కోటి ౪ లక్షల పై చిలుకు చీరలను పంపించారని అందులో సుమారు సగానికి పైగా చీరలు తెలంగాణ లో నెయ్యగా మిగితావి సూరత్ లాంటి ప్రదేశాల నుండి తెప్పిచారు అన్నారు.

పేదింటి తెలంగాణా ఆడబిడ్డలు పండుగ పూటకొత్త చీర కట్టుకోవాలి అలాగే చేనేత కార్మికులకు ఉపాధి కల్పివాలి అనే గొప్ప ఉద్దేశం చేపట్టిన కార్యక్రమాన్ని మనం అందరం హర్షిచాలి అని పిలుపునిచ్చారు.

English summary
NRI TRS President Anil Kurmachalam condemned oppostion parties allegations Batukamma sarees issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X