వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘనంగా అన్నమయ్య 607వ జయంతి ఉత్సవాలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

మిచిగాన్: మే 2వ తేదిన, అన్నమాచార్య 607వ జయంతి పండుగని భారతీయ టెంపుల్ ట్రాయ్ ఘనంగా జరిపింది. ప్రధాన అర్చకులైన బ్రహ్మా శ్రీ జానకి రామ శాస్త్రి స్వయానా అందరికి అ భయం ఇచ్చు అ దేవ దేవునికి పాటతోఅన్నమాచార్యుల వారికీ మొదటగా ప్రార్ధన చేసారు.

అంతే కాక జానకి రామ శాస్త్రి జగదేక పతి అయిన వేంకటేశ్వరుడు అమ్మావారిని వక్షస్థలంపై కుర్చొపెట్టుకొని స్వామి వారు వయ్యారంగా నడుస్తుంటే ఎలావుంటొందొ అని వర్ణించే అన్నమాచార్య వారి కీర్తన ( ఒకపరికొకపరి)
గంధాన్ని శ్రోతల మీద జల్లి సంగీత కచేరిని నిర్వహించారు.

మినీ గర్గ్, మహావీర్ కేతవాట్, ఆనంద్ వరదరాజన్‌లు జ్యోతిని వెలిగించి శ్రోతలందరినీ ఆహ్వానించారు. సుమారుగా 120 మంది పిల్లలు, 30 మంది సంగీత విద్వాంసులు కలిసి 65 కీర్తనలు పాడారు. ముద్దు గారే యశోధ ముంగిట ముత్యము, తిరుమల గిరి రాయ, గోవింద గోవింద అని కొలువరే, నారాయణతే నమో నమో, ఎంత మాత్రమునెవ్వరు తలచిన అంత మాత్రమే నువ్వు, శరణు శరణు సురేంద్ర, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు
వాడు, భావయామి గోపాల బాలం లాంటి కీర్తనలతో శ్రోతలను 6 గంటల పాటు అలరించారు.

Annamacharya 607th jayanthi celebrations at Bharatiya temple

శాంతా ప్రకాష్ మంగాంబుధి హనుమంత అనే కీర్తనతో అందరిని ఆకట్టుకున్నారు. ఈ కచెరీకి, ఇందిరెష్ మక్తల్, వెంకటెశ్ మ్రిదంగ సహకారం అందించగా, జయ శంకర్ బాలన్ సిశ్యులు వయొలిన్ సహకారం అందించారు. సంగీతానికి భాషా బేధాలు లేవనడానికి ఆన్నమాచార్య జయంతి కార్యక్రమమే నిదర్శనం.

ఈ కార్యక్రమంలొ తెలుగు, తమిళం, కన్నడ, మలయాలీలు పాడారు. ఈ కార్యక్రమానికి నారాయనస్వామి, నాగరాజు కొట వారి బ్రుందం వ్యాఖ్యాతలుగా ప్రతి కీర్తనలకు అర్ధం చెప్పి శ్రోతలకు పరిచయం చేశారు. మిహిర్, అనిరుద్, అనిష్క ( చిన్నారులు) అన్నమయ్య చరిత్రను శ్రోతలకు తెలియజేశారు.

ఎంతొ మంది ఉత్తర భారతియులు భక్తతొ కీర్తనలను విన్నారు. ఈ కార్యక్రమనికి సుమారుగా 750 మంది విచ్చేశారు. సమయం మించకుండా వుండడానికి వెంకట్ దిడుగు, సంకర్ దొరైస్వామిలు ఎంతొ కృషి చేశారు. చివరకుజొఓచ్చుతనంద జొజొ ముకుంద అనె కీర్తన తొ స్వామి వారికి పవలింపు సేవ చేసి క్షీరాబ్దికన్యకకు కీర్తనతొ మంగలారతి ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంగీత కళాకారులు సుమరు 750 మంది శ్రోతలకు వీనుల విందును పంచగా, అరున్ పాండ్య, శ్రిధర్ శ్రిగరిరాజు బృందం పసందైన విందు భొజనం ఏర్పాటు చేసారు.

English summary
Annamacharya 607th Jayanthi Celebrations at Bharatiya temple in Troy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X