వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింగపూర్ అల్లర్లు: మరో భారతీయుడి అరెస్ట్

|
Google Oneindia TeluguNews

arrest
సింగపూర్: సింగపూర్‌లోని లిటిల్ ఇండియాలో ఇటీవల చోటు చేసుకున్న అల్లర్ల నేపథ్యంలో అక్కడి పోలీసులు మరో ప్రవాస భారతీయుడ్ని అరెస్ట్ చేశారు. అల్లర్లలో విధ్వంసం సృష్టించారనే నెపంతో ఇప్పటికే 33 మంది భారతీయులను విచారిస్తున్నారు. డిసెంబర్ 8న జరిగిన అల్లర్లకు సంబంధం ఉందన్న సమాచారంతో ఈ నెల 12న లిటిల్ ఇండియాలో 41ఏళ్ల భారతీయుడ్ని సోమవారం అరెస్ట్ చేసినట్లు తెలిసింది.

అయితే ఈ అరెస్టుపై పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. కాగా లిటిల్ ఇండియాలో నడుచుకుంటూ వెళుతున్న శక్తివేల్ కౌరవేలు(33) అనే భారతీయుడ్ని ఓ ప్రైవేటు బస్సు ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దక్షిణాసియాకు చెందిన సుమారు 400 మంది కార్మికులు అల్లర్లకు దిగారు.

దక్షిణాసియా ప్రాంతానికి చెందిన ప్రజలు ఎక్కువగా నివాసం ఉండే ప్రాంతమే సింగపూర్‌లోని లిటిల్ ఇండియా. ఇక్కడే భారత దేశానికి చెందిన పలువురు వ్యాపారాలు, హోటళ్లు నిర్వహిస్తున్నారు. కార్మికుల అల్లర్లలో సుమారు 39 మంది పోలీసు, రక్షణ సిబ్బందికి గాయాలయ్యాయి. 16 పోలీసు వాహనాలతోపాటు 25 వాహనాలు ధ్వంసమయ్యాయి.

సింగపూర్‌లో గతంలో 1969లో జరిగిన అల్లర్ల తర్వాత మళ్లీ ఇప్పుడే అలాంటి ఘటన చోటుచేసుకోవడంతో సింగపూర్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని ప్రకటించింది. ఘటన జరిగిన వెంటనే 27మంది దక్షిణాసియాకు చెందిన కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అదుపులోకి తీసుకున్న 33మంది భారతీయుల్లో ఏడుగురిని విడుదలు చేశారు. అల్లర్లలో వీరి పాత్ర ఏమిలేదని రుజువుకావడంతో విడుదల చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అల్లర్లతో ప్రమేయం ఉన్న 56మందిని గుర్తించామని, వారిలో భారత, బంగ్లాదేశీయులు ఉన్నారని చెప్పారు. వారిపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. నేరం రుజువైతే వారి దేశాలకు పంపనున్నట్లు పోలీసులు చెప్పారు.

English summary
Another Indian has been arrested in connection with Singapore's worst outbreak of violence in over 40 years and will be charged tomorrow for alleged rioting, taking the total number of Indians arraigned in the incident to 34.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X