వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో సిక్కు, అతడి తల్లిపై దాడి: హేట్‌‌క్రైంపై త్వరలో భేటీ

|
Google Oneindia TeluguNews

Another Sikh, his mother attacked in New York
న్యూయార్క్: అమెరికాలో సిక్కులపై దాడులు పెరిగిపోతున్నాయి. మరోసారి సిక్కులపై దాడి జరిగింది. కొద్ది రోజుల క్రితమే ఓ సిక్కును ట్రక్కుతో ఢీకొట్టిన ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. ఒసామా బిన్ లాడెన్ అంటూ ఓ సిక్కు, అతని తల్లిపై కొందరు అమెరికన్ యువకులు దాడి చేశారు. దీంతో వారిద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆగస్టు 7న నైబర్స్‌హుడ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.

ఆగస్టు 7వ తేదీన రాత్రి తమపై దాడి జరిగిందని ఫిజిషియన్ సైంటిస్టు అయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ మత సాంప్రదాయ ప్రకారం టర్బన్స్ ధరించామని, అయితే సుమారు 10మంది యువకులు ఒసాబా బిన్ లాడెన్ అంటూ తమపై దాడి చేశారని అతను తన ఫిర్యాదు పేర్కొన్నారు. అంతేగాక తమ దేశానికి వెళ్లిపోమ్మంటూ హెచ్చరించారని చెప్పారు.

తమ తల్లి పట్ల వారు అభ్యంతరకరంగా ప్రవర్తించారని, దూషించారని తెలిపారు. తాను వద్దని వారిస్తే తనపై పిడిగుద్దులు గుద్దారని, అందరూ కలిసి దాడి చేశారని చెప్పారు. పారిపోతూ తమపై ఓ బాటిల్ విసిరి వెళ్లారని తెలిపారు. వారిని వెంబండించేందుకు ప్రయత్నించినా తీవ్రమైన గాయాలవల్ల తాను కదల్లేకపోయానని చెప్పాడు. పోలీసులకు ఫోన్ చేయడంతో బాధితులను వారు ఆస్పత్రికి తరలించారు.

తనను చూసేందుకు భారతదేశం నుంచి తన తల్లి ఇక్కడి వచ్చిందని, ఈ సమయంలో మా ఇద్దరిపై దాడి జరిగిందని తెలిపారు. తమపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరాడు. తమ వర్గంపై దాడులను నియంత్రించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆయన పోలీసులను కోరారు. తమ తల్లి అమెరికన్స్ ఇతర మతాలను గౌరవిస్తారని భావించేవారని.. అయితే ఇలాంటి ఘటన ఎదురుకావడం విచారకరమని తెలిపారు.

కాగా, తమ వర్గంపై వరుసగా దాడులు జరగడంపై సిక్కు సమాజం ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికాలోని పలు గురుద్వారాలకు చెందిన ప్రతినిధులు ఈ వారంలో సమావేశం కానున్నట్లు ఇటీవలే ఏర్పాటైన ఎన్ఎస్‌సి ప్రకటించింది. అమెరికాలో నివసిస్తున్న సిక్కుల ప్రయోజనాల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. అమెరికాలోని సిక్కులంతా ఒకే ఎజెండాపై సమావేశం కానుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

English summary
Just days after a Sikh man was hit and dragged by a truck, another Sikh man and his mother were attacked here by a group of teenagers who called them 'Osama Bin Laden' in an apparent hate crime, sparking fresh outrage among the community members.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X