• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తానా స‌భ‌ల వేళ‌: చ‌ంద్ర‌బాబు స‌న్నిహితుడిపై వేటు: జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం..!

|

అమెరికాలో తానా సంబ‌రాలు అరంభం అవుతున్న వేళ ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. టీడీపీ లో ఎన్నారై వ్య‌వ‌హారాల్లో కీల‌కంగా వ్య‌వ‌హిరించే వ్య‌క్తి మీద వేటు వేసారు. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఆయ‌న అత్యంత స‌న్నిహితుడు. చంద్ర‌బాబు లేదా ఆయ‌న కుమారుడు అమెరికాలు కాలు పెడితే ఆయ‌న‌కు స్వాగ‌తం ద‌గ్గ‌ర నుండి అన్ని కార్యాక్ర‌మాలు మొత్తం ప‌ర్య‌వేక్షించారు. ఇక‌..అమెరికాలో తెలుగు వారు తానా మ‌హాస‌భ‌ల పేరుతో ఉత్స వాలు జ‌రుపుకుంటున్న వేళ‌..జ‌గ‌న్ ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో..ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం అధికార వ‌ర్గాల్లో నే కాదు..రాజ‌కీయంగా ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

కోమ‌టి జ‌య‌రాంపై వేటు..

కోమ‌టి జ‌య‌రాంపై వేటు..

అమెరికాలో ఏపీ ప్ర‌భుత్వ ప్రత్యేక ప్ర‌తినిధి హోదాలో ఉన్న కోమ‌టి జ‌య‌రాం పైన జ‌గ‌న్ ప్ర‌భుత్వం వేటు వేసింది. టీడీపీకి అత్యంత స‌న్నిహితుడు అయిన జ‌య‌రాం టీడీపీ హ‌యాంలో అమెరికా వ్య‌వ‌హారాల్లో కీల‌క పాత్ర పోషించారు.
టీడీపీ అధినేత చంద్ర‌బాబు ..లోకేశ్ తో పాటుగా టీడీపీ నేత‌లు ఎవ‌రు అమెరికా వ‌చ్చినా ఆయ‌న వారికి అతిధ్యం అందించ‌టం మొద‌లు అక్క‌డ అన్ని కార్యక్ర‌మాలు ప‌ర్య‌వేక్షించేవారు. తెలుగువారికి సంబంధించిన సభలు ఏమైనా జరిగినా వీటన్నింటినీ జయరామే దగ్గరుండి చూసుకునే వారు. ఆయ‌న‌కు చంద్ర‌బాబు ఏరి కోరి త‌న హాయంలో అమెరికాలో ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధి హోదా క‌ల్పించారు. ఆయ‌నతో పాటుగా వేమూరి ర‌వి ప్ర‌సాద్ సైతం ఎన్నారైల వ్య‌వ‌హారాల‌ను చంద్ర‌బాబుక అనుకూలంగా చ‌క్క‌బెట్టేవారు. ఆయ‌న‌కు ఏపీ ఎన్నార్టీ ఛైర్మ‌న్ ప‌ద‌విని నాడు చంద్ర‌బాబు అప్ప‌గించారు. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ అధికారంలోకి రావ‌టంతో కోమ‌టి జ‌య‌రాంను ఆ ప‌ద‌వి నుండి త‌ప్పిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

తానా స‌భ‌లు జ‌రుగుతున్న వేళ‌..

తానా స‌భ‌లు జ‌రుగుతున్న వేళ‌..

అమెరికాలో తానా మ‌హాస‌భ‌లు ప్రారంభం అవుతున్నాయి. ఉత్త‌ర అమెరికా తెలుగు సంఘం ఆధ్వ‌ర్యంలో జ‌రిగే ఈ స‌భ‌ల‌కు ఏపి-తెలంగాణ నుండి ప్ర‌ముఖులు ఇప్ప‌టికే త‌ర‌లి వెళ్లారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్‌ను సైతం తానా ప్ర‌తినిధులు ఆహ్వానించారు. అదే విధంగా తెలంగాణ మంత్రులు..టీడీపీలో ప్ర‌ముఖులు ఇప్ప‌టికే అమెరికాకు చేరు కున్నారు. వీరంద‌రికీ తానా సంఘం ప్ర‌త్యేక గుర్తింపు ఇవ్వ‌నుంది. ఇదే స‌మ‌యంతో తానాలో పెద్ద త‌ల‌కాయ గా ఉండే కోమ‌టి జ‌య‌రాంను త‌ప్పిస్తూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం ప్ర‌క‌టించింది. ఉద్దేశ పూర్వ‌క‌మో..యాధృచ్చిక‌మో కానీ కోమ‌టి జ‌య‌రాంను ఈ రోజ‌నే త‌ప్పిస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌టం పైన చర్చ సాగుతుంది. తానాకు కోమ‌టి జ‌య‌రాం సుదీర్ఘ కాలం అధ్య‌క్షుడిగా ప‌ని చేసారు. ఉత్తర అమెరికాలో అనేక తెలుగు సంఘాల‌కు ప్రతినిధిగా ఉన్నారు. దీంతో ఇప్పుడు జ‌య‌రాం పైన వేటు అనివార్య‌మైనా..నిర్ణ‌యం తీసుకున్న సంద‌ర్భం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

తాజా ఎన్నిక‌ల్లో ఎంపీ సీటు అశించి..

తాజా ఎన్నిక‌ల్లో ఎంపీ సీటు అశించి..

కోమ‌టి జ‌య‌రాం చాలా కాలం క్రితం అమెరికాలో సెటిల్ అయ్యారు.కృష్ణా జిల్లాకు చెంద‌ని కోమ‌టి జ‌య‌రాం తొలి నుండి టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో స‌న్నిహితంగా ఉండేవారు. టీడీపీకి సేవ‌లు అందించారు.ఏపీలో ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా అమెరికా నుండి కొంద‌రు ప్ర‌వాసాంధ్రులు ఏపీకి వ‌చ్చి టీడీపీకి అనుకూలంగా ప్ర‌చారం చేస్తారు. తాజా ఎన్నిక‌ల స‌మయంలోనూ అదే జ‌రిగింది. ఇక‌, కోమ‌టి జ‌య‌రాం కొద్ది రోజుల క్రితం జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ నుండి ఎంపీగా పోటీ చేయాల‌ని భావించారు. అందు కోసం విజ‌య‌వాడ లేదా గుంటూరు స్థానాలను ఆశించారు. అక్క‌డ రెండు చోట్ల సిట్టింగ్‌ల‌కే ఇవ్వాల్సి రావ‌టంతో ఆయ‌న‌కు సీటు ద‌క్క‌లేదు. భ‌విష్య‌త్‌లో రాజ్య‌స‌భ సీటు ఇస్తామ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు హామీ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. అయితే, ఇప్పుడు ఏపీలో ప్ర‌భుత్వం మార‌టం..గ‌త ప్రభుత్వంలో ఇచ్చిన పోస్టు నుండి కోమ‌టి జ‌య‌రాంను త‌ప్పించ‌టంతో..ఇక ఇప్పుడు జ‌గ‌న్ ఈ బాధ్య‌త‌ల‌ను అమెరికాలో ఎవ‌రికి అప్ప‌గిస్తార‌నే ఆస‌క్తి క‌ర‌మైన చ‌ర్చ మొద‌లైంది.

English summary
AP Govt taken key decision that cancelled the posting of Komati Jayaram as AP special representative in USA. At the time of TANA celebrations AP govt taken this decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X