వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో మహిళా దినోత్సవం

|
Google Oneindia TeluguNews

ATA celebrated Women's Day in 5 US Cities
న్యూయార్క్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికా తెలుగు సంఘం (ఆటా) ‘అమెరికాలో ఆడపడచులు' పేరిట వేడుకలను నిర్వహించింది. ఈ వేడుకలను అమెరికాలోని ఐదు ప్రధాన నగరాల్లో నిర్వహించినట్లు ఆటా నిర్వాహకులు తెలిపారు. మార్చి 2న డల్లాస్, అట్లాంటా, మిన్నియాపోలీస్, హూస్టన్, వాషింగ్టన్ డిసిలలో వేడుకలను నిర్వహించినట్లు, మార్చి 14న ఫిలడెల్ఫియా, మార్చి 15న చికాగో, మార్చి 30న ఆస్టిన్, మార్చి 29న భారతదేశంలోని హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు.

డల్లాస్‌లో వేడుకలు

మార్చి 2న డల్లాస్‌లోని మయూరి ఇండియన్ రెస్టారెంట్ ఆటా మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించింది. ఈ వేడుకల నిర్వహణలో టాంటెక్స్ (టిఏఎన్‌టిఈఎక్స్), డిఎఫ్‌డబ్ల్యూ తెలుగు ఆర్గనైజేషన్ భాగస్వాములయ్యాయి. ఈ వేడుకల్లో లిటరరీ, కల్చరల్, ఎడ్యుకేషన్, మత సంబంధ, సామాజిక, ఆర్థిక, ఆరోగ్య, ఇతర అంశాలపై చర్చించడం జరిగింది. వేడుకల్లో వందమందికి పైగా ఎన్నారైలు హాజరయ్యారు.

ఆటా డిఎఫ్‌డబ్ల్యూ ప్రాంతీయ కో-ఆర్డినేటర్ అరవింద్ రెడ్డి ముప్పిడి, అనంత్ రెడ్డి పుజ్జూరు, సతీష్ రెడ్డి, ధీరజ్ ఆకుల, శ్రీకాంత్ కొండా, విజయ్ మోహన్ కాకర్ల, శ్రీలక్ష్మి మందిగ, కవితా ఆకుల, డాక్టర్ నిర్మల వల్లూరుపల్లి, డాక్టర్ సంధ్యా గవ్వా, జ్యోతి జాస్తి, కృష్ణవేణి శీలం, సతీష్ పున్నంలు పాల్గొన్నారు. వేడుకల్లో నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు అలరించాయి. వేడుకల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కాగా జులై 3 నుంచి 5 వరకు నిర్వహించనున్న ఆటా సదస్సు, యూత్ కన్వెన్షన్‌కు హాజరు కావాలని డిఎఫ్‌డబ్ల్యూ ఆటా ఈ సందర్భంగా ఆహ్వానించింది.

అట్లాంటాలో..

ఆటా ఆధ్వర్యంలో అట్లాంటాలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 600 మంది తెలుగు ప్రజలు హాజరయ్యారు. భారీగా తెలుగు ప్రజలు హాజరుకావడంతో కార్యక్రమం మరింత విజయవంతంగా జరిగిందని ఆటా సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో హన్మంత్ రెడ్డి, కరుణాకర్ మాధవరం, కరుణాకర్ ఆసిరెడ్డి, జగన్మోహన్ రావు, నరేందర్ చమర్ల, కిరణ్ పాశం, కళ్యాణ్ ఆనందుల, ప్రశాంతి ఆసిరెడ్డి పాల్గొన్నారు.

జులై 3,4,5 తేదీల్లో ఫిలడెల్ఫియాలో జరగనున్న ఆటా సదస్సుకు ఆర్థిక విరాళం అందించిన దాతలకు ఈ సందర్భంగా ఆటా కృతజ్ఞతలు తెలిపింది. మురళీ సజ్జా, కిరణ్ పాశం, కరుణాకర్ ఆసిరెడ్డి, మురళీ రెడ్డిలు విరాళం అందించడంలో ఎప్పుడూ ముందుంటున్నారని ఆటా తెలిపింది. కాగా, ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సురేష్ కారోతు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. అంజనా సౌమ్య, సందీప్, నిహార్, శ్రీనివాస్ దుర్గం, జనార్ధన్ పన్నెల పాడిన పాటలు అహుతులను అలరించాయి. అనిల్ బొడ్డిరెడ్డి, రఘు బండ, నంద చట్ల, విక్రమ్ సిధిని, వెంకట్ వీరనేనిలతోపాటు కార్యక్రమానికి సహకారానికి ఆటా కృతజ్ఞతలు తెలిపింది.

మిన్నియాపోలీస్

మిన్నియా పోలీస్ లోని హమెల్ కమ్యూనిటీ సెంటర్‌లో మార్చి 8న మహిళా దినోత్సవం పురస్కరించుకుని పలు కార్యక్రమాలను ఆటా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన, రాణించిన మహిళలు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటి లయ హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు, సంప్రదాయ నృత్యాలు అహుతులను ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో జ్యోతి రేపాల, శాంభవి, డాక్టర్ సుభాషిణి మహిపతి, డాక్టర్ సుభాషిణి, అపేక్ష పాండ, మోలు మాథ్యూ థచిల్, కారోల్ కీర్స్, సుమ అనపర్తి, కమల వి పురం, పద్మజ ధర్నిప్రగడ, కుముద్ సానే, నిర్మలా రాజశేఖర్, మాధవి ఇసానక, మేయర్ ఎలిజబెత్ వేర్, సిటీ మేయర్ హమెల్ పాల్గొన్నారు. మహిపతి నాగేందర్ ఈ కార్యక్రమంలో ప్రసంగించి తన ఆమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు.

హూస్టన్‌లో మహిళా దినోత్సవం

జీయర్ ఎడ్యూకేషన్ ట్రస్ట్ సహకారంతో ఆటా సభ్యులు హూస్టన్‌లోని అష్టలక్ష్మి ఆలయంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ముఖ్య పూజారి శ్రీమన్ హనుమాన్ స్వామి పలు కీర్తనలు ఆలపించారు. భారత కాన్సులేట్ జనరల్ హరీష్ పర్వతనేని సతీమణి నందిత పర్వతనేని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని వివిధ రంగాల్లో రాణించిన మహిళలకు పురస్కారాలు అందించారు.

ఈ కార్యక్రమంలో చిత్ర దివాకరుణి, కల్పలత, లీలా కృష్ణమూర్తి, రత్న కుమారి, డాక్టర్ లలిత సుందర్, డాక్టర్ రంగ కందాల, బంగార్ రెడ్డి, డాక్టర్ అపర్ణ కందాల, నీతా చాడ, శ్రీధర్ రెడ్డి కంచంకుంట్ల, శ్రవణ్, నరేందర్, దయాకర్, ప్రవీణ్, బావ, కీర్తి, క్రాంతి, పరిమళ, వర, రగు, డాక్టర్ రేణు తమిరిస, డాక్టర్ రంగా, డాక్టర్ అపర్ణ కందాల పాల్గొన్నారు.

వాషింగ్టన్‌లో..

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆటా ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకులకు సుమారు 400మందికిపైగా ఎన్నారైలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్వేత నరోజి, శీలానాయక్, నిరతి రావు, నీరజ లింగం, మిస్ కొలంబియా జిల్లా బిందు పామర్థి, సౌమ్య కొండపల్లి, ఆర్య గణేశన్, రమ్య కొర్కుల్, రాధిక రాజేష్, జనెత కంచర్ల, కవిత చల్ల, మేథా అన్నం, భారతి కల్వల, జ్యోతిమయి చవలి, నందిని యేదుల, శ్రీలేఖ పల్లె, జ్యోతి చెరుకుపల్లి, ఉత్పల రాజన్, రాజేష్ మదిరెడ్డి, రవి బొజ్జ, వెంకట్ కొండపోలు, శ్రీధర్ బానల, భువనేశ్ బూజల, రాంమోహన్ కొండా, లోకేష్ రెడ్డి, మనోహర్ ఏనుగు, జయేందర్ రెడ్డి అన్నం పాల్గొన్నారు.

English summary

 American Telugu Association (ATA) celebrated “Americalo Adapaduchulu” to mark the International Women’s Day on Sunday, March 02, 2014 in Dallas, Atlanta, Minneapolis, Houston, and Washington D.C. The celebrations will take place in Philadelphia on March 14, in Chicago on March 15, in Austin on March 30, and in Hyderabad on March 29.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X