వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఆటా' నూతన అధ్యక్షుడిగా సుధారక్ పెర్కారి(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

లాస్‌వేగాస్: అమెరికా తెలుగు సంఘం తమ ధర్మకర్తల మండలి సమావేశం నెవెడా రాష్ట్రంలోని లాస్‌వేగాస్ నగరంలో వెనీషియన్ హోటల్లో జనవరి 17న నిర్వహించారు. అమెరికాలో 'ఆటా' అని పిలవబడే ఈ సంస్ధకు సుధాకర్ పెర్కారి నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఆటా బోర్డు సభ్యులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో పాటు, లాస్ వేగాస్ మరియు కాలిఫోర్నియాలలో నివసిస్తున్న తెలుగువారు కలిపి 200 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ప్రస్తుత అధ్యక్షుడు కరుణాకర్ మాధవరం కొత్త అధ్యక్షుడు సుధాకర్ పెర్కారికి బాధ్యతలు అప్పగించారు. పెర్కారితో పాటు, కొత్తగా ఎన్నుకోబడిన ధర్మకర్తల మండలి సభ్యులు కూడా బాధ్యతలు స్వీకరించారు. 2015 నుండి 2018 వరకు గాను ఆటా సభ్యుల ద్వారా ఏకగ్రీవంగా ఎన్నికయిన 14 మంది నూతన ధర్మకర్తల మండలి సభ్యులు కరుణాకర్ అసిరెడ్డి, అరవింద్ ముప్పిడి, శ్రీరాం రెడ్డి, నరేందర్ చీమర్ల, రవి పటోల్ల, అజయ్ ఆలేటి, లోకేష్ అనంతుల, శ్రీధర్ బాణాల, పరమేష్ భీంరెడ్డి, శ్రీనివాస్ దర్గుల, వినోద్ కుకునూర్, హరి లింగాల, వేణుగోపాల్ సంకేనేని ఈ సమావేశంలో ప్రమాణ స్వీకారం చేశారు.

నూతన కార్యనిర్వహణ, ధర్మకర్తల బృందం సభ్యులు ఆటా రాజ్యాంగం, అనుబంధ చట్టాలను గౌరవించి, పాటిస్తామని హామీ ఇచ్చారు. నూతన కార్యవర్గం, కరుణాకర్ అసిరెడ్డని (అట్లాంటా) ఎన్నికయిన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది.

పెర్కారి తన అధ్యక్ష ప్రసంగంలో ఆటా ఈ సంవత్సరం 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న విషయాన్ని సభకు తెలియజేశారు. ఒక సంస్ధగా ఆటా 25 వసంతాలు పూర్తి చేసుకోవడం ఒక ప్రధాన మైలురాయిగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆటా స్ధాపించబడిన ప్రధాన లక్ష్యాలను సభికులకు గుర్తు చేశారు.

అమెరికాలో నివసిస్తున్న తెలుగుజాతికి, వారి సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించేందుకు, తెలుగు సాహిత్య, సాంస్కృతిక, విద్యా, సామాజిక, ఆర్ధిక కార్యకలాపాలు, ఇతర అంశాలను ప్రోత్సహించాడనికి ఆటా అన్ని వేళలా కృషి చేస్తూనే ఉంటుందని అన్నారు. తనతోపాటు ఏర్పడబోయే కార్యనిర్వహక బృందం తమ తదుపరి రెండు సంవత్సరాల కోసం ప్రణాళికలను ఆవిష్కరించారు. 2016లో చికాగో నగరంలో జరిగే మూడు రోజుల 14వ ద్వైవార్షిక జాతీయ సదస్సులో భాగంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తామని తెలియజేశారు.

ఆట ధర్మకర్తల మండలి, 2015-16 కాలానికి నూతన కార్యనిర్వహక బృందాన్ని ఎన్నుకుంది:

అధ్యక్షుడు: సుధాకర్ పెర్కారి
ఎన్నికయిన అధ్యక్షుడు: కరుణాకర్ అసిరెడ్డి
కార్యదర్శి: మాధవి బొమ్మినేని
కోశాధికారి కళ్యాణ్: ఆనందుల
సంయుక్త కార్యదర్శి: సౌమ్య కొండపల్లి
సంయుక్త కోశాధికారి: సురేష్ జిల్లా
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్: బల్వంత్ కొమ్మిడి

కొత్త నిర్వాహక కమిటీ, చికాగో, డల్లాస్‌లో జరిగే ద్వైవార్షిక సమావేశాల కోసం కార్యవర్గాన్ని నియమించారు. చికాగోలో 2016లో జరిగే 14వ ద్వైవార్షిక సమావేశాలు, సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు నరేందర్ చీమర్ల కన్వీనర్‌గా, సత్య కందిమళ్ల ప్రధాన సలహాదారుగా నియమితులయ్యారు. మిగిలిన 2016 ఉత్సవాల కమిటీలను త్వరలో ప్రకటిస్తారు.

2018లో డల్లాస్ నగరంలో జరగబోయే 15వ ద్వైవార్షిక సమావేశాలు కోసం ఈ క్రింది బృందాన్ని ఎంపకి చేశారు:

కన్వీనర్: సతీష్ రెడ్డి
సమన్వయకర్త: ధీరజ్ ఆకుల
కో-కన్వీనర్: అరవింద్ ముప్పిడి
కాన్ఫరెన్స్ డైరెక్టర్: అజయ్ ఆలేటి

పెర్కారి తన ప్రసంగంలో, మాజీ అధ్యక్షుడు కరుణాకర్ మాధవరం, మాజీ కార్యనిర్వాహక జట్టు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల ఫిలడెల్ఫియాలో జరిగిన 13వ దైవార్షిక సమావేశాలు అత్యంత విజయవంతంగా నిర్వహించినందుకు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కన్వీనర్ పరమేష్ భీంరెడ్డి, సమన్వయకర్త భువనేష్ భూజాల, ఇతక కమిటీ సభ్యులను ప్రశంసించారు.

'ఆటా' నూతన అధ్యక్షుడిగా సుధారక్ పెర్కారి

'ఆటా' నూతన అధ్యక్షుడిగా సుధారక్ పెర్కారి

అమెరికా తెలుగు సంఘం తమ ధర్మకర్తల మండలి సమావేశం నెవెడా రాష్ట్రంలోని లాస్‌వేగాస్ నగరంలో వెనీషియన్ హోటల్లో జనవరి 17న నిర్వహించారు. అమెరికాలో 'ఆటా' అని పిలవబడే ఈ సంస్ధకు సుధాకర్ పెర్కారి నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

'ఆటా' నూతన అధ్యక్షుడిగా సుధారక్ పెర్కారి

'ఆటా' నూతన అధ్యక్షుడిగా సుధారక్ పెర్కారి

ఆటా బోర్డు సభ్యులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో పాటు, లాస్ వేగాస్ మరియు కాలిఫోర్నియాలలో నివసిస్తున్న తెలుగువారు కలిపి 200 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

 'ఆటా' నూతన అధ్యక్షుడిగా సుధారక్ పెర్కారి

'ఆటా' నూతన అధ్యక్షుడిగా సుధారక్ పెర్కారి

నూతన కార్యనిర్వహణ, ధర్మకర్తల బృందం సభ్యులు ఆటా రాజ్యాంగం, అనుబంధ చట్టాలను గౌరవించి, పాటిస్తామని హామీ ఇచ్చారు. నూతన కార్యవర్గం, కరుణాకర్ అసిరెడ్డని (అట్లాంటా) ఎన్నికయిన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది.

 'ఆటా' నూతన అధ్యక్షుడిగా సుధారక్ పెర్కారి

'ఆటా' నూతన అధ్యక్షుడిగా సుధారక్ పెర్కారి

పెర్కారి తన అధ్యక్ష ప్రసంగంలో ఆటా ఈ సంవత్సరం 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న విషయాన్ని సభకు తెలియజేశారు. ఒక సంస్ధగా ఆటా 25 వసంతాలు పూర్తి చేసుకోవడం ఒక ప్రధాన మైలురాయిగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆటా స్ధాపించబడిన ప్రధాన లక్ష్యాలను సభికులకు గుర్తు చేశారు.

English summary
The American Telugu Association, an umbrella body of the community in the United States, has held its board meeting at the Venetian hotel in Las Vegas, Nevada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X