హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమైక్యంగా ఉండాలి: కేసీఆర్‌, ఆటా ఆహ్వానం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అమెరికాలో ఉన్న తెలంగాణవాసులంతా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని, సమైక్యంగా ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సూచించారు.

జూలై 1నుంచి 3 వరకు షికాగోలో జరిగే అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఏటీఏ) 14వ సదస్సుకు ముఖ్య అతిధిగా రావాలని కోరుతూ ఆటా ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ సుధాకర్ పెర్కారి, ట్రస్ట్ మెంబర్ లక్ష్మణ్ అనుగు సోమవారం అసెంబ్లీలో సీఎంను కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సీఎం కెసిఆర్ వారితో సమావేశమయ్యారు. అమెరికాలో తెలంగాణవాసులు చాలామంది మంచి స్థితిలో ఉండడం ఆనందకరమన్నారు. తెలంగాణ బిడ్డలు సంఘాల పేరుతో విడిపోకుండా సమైక్యంగా ఉండాలన్నారు. అమెరికాలో ఉండే తెలంగాణవారి స్థితిగతులు, ఇతర పరిస్థితులపై సీఎం ఆరా తీశారు.

బతుకుదెరువు కోసం అమెరికా వెళ్లిన తెలంగాణ వారు చాలా కొద్ది కాలంలోనే బాగా ఎదిగారని, 60-70 వేల అమెరికన్ డాలర్ల తలసరి ఆదాయం కలిగి ఉన్నారని సుధాకర్, లక్ష్మణ్‌లు సీఎంకు వివరించారు. చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణకు, పట్టణాలు పరిశుభ్రంగా ఉంచడానికి అక్కడి ప్రభుత్వాలు అనుసరిస్తున్న పద్ధతులను సీఎం అడిగి తెలుసుకున్నారు.

హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వారికి వివరించారు. ఉపాధి కల్పన కోసం, పౌరసేవల కోసం అమలవుతున్న విధానాలను తెలుసుకున్నారు. ఆటా సమావేశాలు విజయవంతం కావాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

కెసిఆర్‌, ఆటా ఆహ్వానం

కెసిఆర్‌, ఆటా ఆహ్వానం

అమెరికాలో ఉన్న తెలంగాణవాసులంతా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని, సమైక్యంగా ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సూచించారు.

కెసిఆర్‌, ఆటా ఆహ్వానం

కెసిఆర్‌, ఆటా ఆహ్వానం

జూలై 1నుంచి 3 వరకు షికాగోలో జరిగే అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఏటీఏ) 14వ సదస్సుకు ముఖ్య అతిధిగా రావాలని కోరుతూ ఆటా ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ సుధాకర్ పెర్కారి, ట్రస్ట్ మెంబర్ లక్ష్మణ్ అనుగు సోమవారం అసెంబ్లీలో సీఎంను కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు.

కెసిఆర్‌, ఆటా ఆహ్వానం

కెసిఆర్‌, ఆటా ఆహ్వానం

ఈ సందర్భంగా సీఎం కెసిఆర్ వారితో సమావేశమయ్యారు. అమెరికాలో తెలంగాణవాసులు చాలామంది మంచి స్థితిలో ఉండడం ఆనందకరమన్నారు.

కెసిఆర్‌, ఆటా ఆహ్వానం

కెసిఆర్‌, ఆటా ఆహ్వానం

బతుకుదెరువు కోసం అమెరికా వెళ్లిన తెలంగాణ వారు చాలా కొద్ది కాలంలోనే బాగా ఎదిగారని, 60-70 వేల అమెరికన్ డాలర్ల తలసరి ఆదాయం కలిగి ఉన్నారని సుధాకర్, లక్ష్మణ్‌లు సీఎంకు వివరించారు.

English summary
A delegation of American Telugu Association called on Telangana Chief Minister K. Chandrashekar Rao here on Monday and invited him to attend ATA’s 13th Conference being held from July1-3.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X