NRI News: ఏపీ సీఎం జగన్ కు ఆహ్వానం పలికిన ఆటా ప్రతినిధులు..
జూన్ 7 నుంచి 9 వరకు అమెరికా జార్జియాలోని అట్లాంటాలో 18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ వేడుకలను అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు కొంత మంది ఆటా ప్రతినిధులు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించడాకి
హైదరాబాద్ కు వచ్చారు.
తాజాగా ఆట ప్రతినిధులు ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ ఆటా ఉత్సవాలకు ఆహ్వానించారు. అమెరికాలోని అట్లాంటా నగరంలో నిర్వహిస్తున్న ఆటా మహాసభలకు అధ్యక్షురాలు మధు బొమ్మినేని నేతృత్వంలోని బృందం ఆహ్వానం అందజేసింది. శనివారం నాడు జగన్‌ను వీరు కలిసి ఆటా సభలకు ఆహ్వానించారు. అంతకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలకు రావాల్సిందిగా కోరారు.

అలాగే ప్రముఖ నటుడు బాలకృష్ణలకు బొమ్మినేని మధు ఆధ్వర్యంలోని బృందం ఆహ్వానం అందజేశారు. 18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ వేడుకలకు కమిటీని కూడా నియమించారు. కోఆర్డినేటర్ తిరుపతి శ్రీధర్, నేషనల్ కోఆర్డినేటర్ గా సుధిని సాయి ఉండనున్నారు. ఆటా సంస్థ సామాజిక సేవ కార్యక్రమాల్లో ముందుంది. ఆటా నేతృత్వంలో చాలా మందికి సాయం అందించారు.












Click it and Unblock the Notifications