వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

థాంక్స్ కేటీఆర్, కవిత: జీవో రద్దుపై బహ్రెయన్ టీఆర్ఎస్ సెల్ హర్షం

|
Google Oneindia TeluguNews

గల్ఫ్ కార్మికుల వేతనాలు తగ్గింపుపై కేంద్రం ప్రభుత్వం జీవో రద్దు చేసింది. దీనిపై ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ హర్షం వ్యక్తం చేసింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసిన మున్సిపల్ ఐటీ శాఖ మంత్రులు కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, టీఆర్ఎస్‌ ఎంపీలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గత ఏడాది సెప్టెంబర్‌లో 30 నుంచి 50 శతం గల్ఫ్ కార్మికుల వేతనాలు తగ్గిస్తూ రిఫరల్‌ వేజెస్‌ జీవో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సంగతి తెలిసిందే.

గల్ఫ్‌లో పనిచేసే భారతదేశ కార్మికులకు నష్టం చేకూర్చే విధంగా గతేడాది తెచ్చిన రిఫరల్‌ వేజెస్‌ జీవోను రద్దు చేస్తూ.. పాత జీవో ప్రకారమే వేతనాలు చెల్లించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇదీ ఆనందదాయకం అని ఎన్ఆర్ఐ టీఅర్ఎస్ సెల్ బహ్రెయిన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్ అన్నారు. రిఫరల్‌ వేజెస్‌ జీవో వెనక్కి తీసుకోవడం వల్ల గల్ఫ్‌లో గల 88 లక్షల మంది భారతీయులకు ఊరట లభించింది.

bahrain trs cell thanks to minister ktr

Recommended Video

MLC Kavitha, Gangula Kamalakar addressed BC Community Meeting in Nizamabad

గల్ఫ్ కార్మికుల సమస్యలపై వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్, కవిత ధన్యవాదాలు తెలిపారు. వారు కేంద్రమంత్రులతో మాట్లాడగా.. టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో జీవో రద్దు చేయాలని కృషి చేశారని తెలిపారు. కేటీఆర్, కవిత, టీఅర్ఎస్ ఎంపీలకు ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ బహ్రెయిన్ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

English summary
bahrain trs cell thanks to minister ktr and kavitha for central government issue new GO
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X