వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత సంతతి శాస్తవేత్తకు అమెరికా అత్యున్నత అవార్డు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: శాస్త్ర సాంకేతిక రంగంలో అత్యున్నత సేవలందించినందుకు గాను భారత సంతతి శాస్త్రవేత్త ధామస్ కైలాథ్ అమెరికాలో అత్యున్నత అవార్డుని అందుుకున్నారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 'నేషనల్ మెడల్ ఆఫ్ సైన్సు' అవార్డుని 79 ఏళ్ల శాస్త్రవేత్త ధామస్ కైలాథ్‌కు అందించారు.

22 ఏళ్ల వయసులో తన రీసెర్చ్ కోసం ధామస్ కైలాథ్‌ అమెరికాకు వచ్చారని.. టెక్నాలజీ రంగంలో ఆయన సేవలను ఒబామా కొనియాడారు. ఇక ధామస్ కైలాథ్‌ విషయానికి వస్తే 1935లో కేరళలో జన్మించారు.

Barack Obama felicitates Indian-American scientist Thomas Kailath

1956లో పుణె యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. 1961లో మసాచుసెట్స్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ, డాక్టరేట్ అందుకున్నారు. మసాచుసెట్స్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డాక్టరేట్ అందుకున్న తొలి భారతీయ విద్యార్ధి ధామస్ కావడం విశేషం.

ఆ తర్వాత ధామస్ కైలాథ్‌ స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేరారు. పలు పుస్తకాలను ఆయన రాశారు. సైన్స్, ఇంజనీరింగ్ రంగంలో ధామస్ కైలాథ్‌ సేవలకు గాను 2009లో భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.

English summary
US President Barack Obama has felicitated Indian-American scientist Thomas Kailath with the top presidential medal for transformative contributions to the fields of science and technology.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X