వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

|
Google Oneindia TeluguNews

మెల్బోర్న్: సిడ్నీ బతుకమ్మ, దసరా ఫెస్టివల్ ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ (ఎస్‌బీడీఎఫ్), ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం(ఏటీఎఫ్)ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సిడ్నీ దుర్గా ఆలయం ఆడిటోరియంలో నిర్వహించిన బ‌తుక‌మ్మ ఆటా, పాటతో.. సిడ్నీ నగరం పుల‌కించింది. ఆటపాటలు, కోలాటాల చప్పుళ్లతో వీధులు మార్మోగాయి.

'బ‌తుక‌మ్మ బ‌తుక‌మ్మ ఉయ్యాలో.. బంగారు బతుక‌మ్మ ఉయ్యాలో.. ఉయ్యాల పాట‌లు పాడారు. స‌ప్త‌వ‌ర్ణాల శోభిత‌మైన పూల‌దొంత‌ర‌ల బ‌తుక‌మ్మ‌లు చూడ‌ముచ్చ‌టేశాయి. ఉదయం నుంచే ఆడపడుచులు వాటిని ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఉత్త‌మ బ‌తుక‌మ్మ‌ల‌ను నిర్వాహ‌కులు ఎంపిక చేశారు. వాటిని త‌యారు చేసిన మ‌హిళ‌ల‌కు బ‌హుమ‌తుల‌ను ప్రదానం చేశారు.

Bathukamma celebrations in Australia

మ‌నసంతా తెలంగాణ‌పైనే..

వేళ మైళ్ల దూరంలో ఉంటున్నా.. తెలంగాణ ఎన్నారైల మ‌న‌సుంతా తెలంగాణ పైనే ఉంటుంద‌న్నారు సిడ్నీ బతుకమ్మ అధ్యక్షుడు అనిల్ మునగాల తెలంగాణ సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను , ఆచార వ్య‌వ‌హారాల‌ను పాటిస్తుండ‌టం ఇక్క‌డే పుట్టి పెరిగిన పిల్ల‌ల‌కు కూడా తెలంగాణ సంస్కృతిని తెలియ‌జెప్ప‌డమే సంస్థ ముఖ్య ఉదేశ్యమని తెలిపారు

Recommended Video

Bathukamma 2018 : Telangana NRI's Bathukamma Celebrations In Irland

మానవ సంబంధాలు నిలబెట్టి, కొత్త జీవన స్ఫూర్తిని నింపే బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజలకు గొప్ప సంబరమే. ఇటువంటి తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైన సద్దుల బతుకమ్మను సిడ్నీ నగరంలో ప్రవాస తెలంగాణవాసులు కన్నుల పండుగగా జరుపుకున్నారు. వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో మహిళలు, యువతులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Bathukamma celebrations in Australia

ఆడపడుచులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఉయ్యాల పాటలు పాడి ఆడారు. బతుకమ్మ ఆటపాటలతో పరిసరాలు మార్మోగాయి. అందరూ ఒక్కచోట కూడి ఇలా బతుకమ్మను వేడుకగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ఎస్‌బీడీఎఫ్ నిర్వాహాకులు చైర్మన్ రాంరెడ్డి గుమ్మడవాలి తెలిపారు.

Bathukamma celebrations in Australia

ఈ బతుకమ్మ సంబరాల్లో సుమారు 1700-2000 మంది వరకు పాల్గొన్నారు. గాయని మంగ్లీ తన బతుకమ్మ పాటలతో అందరిని ఆకర్షించింది. తెలంగాణ జానపద గీతాలతో గోరెటి వెంకన్న, జంగి రెడ్డి జనాలను ఉర్రూతలూగించారు. ప్రవాస తెలంగాణవాసులే కాకుండా.. పంజాబీలు, చైనీయులు, తమిళులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన వారు పాల్గొని బతుకమ్మ వేడుకలు గొప్పగా ఉన్నాయని అభినందించారు. ఉత్తమ బతుకమ్మ, ఉత్తమ సాంప్రదాయ వేషాధారణకు నిర్వాహకులు బహుమతులను అందజేశారు. ఈ కార్య‌క్ర‌మంలో కౌన్సిల‌ర్ జూలియా ఫిన్, హుగ్ మక్డ్రాట్, సూసై బెంజమిన్, బ‌తుక‌మ్మ వేడుక‌ల్లో విశిష్ట అతిథులుగా హాజరయ్యారు . ఇండియ‌న్ హై క‌మిష‌న్ కార్య‌ద‌ర్శి శ్రీ స్.కే. వర్మ వేడుక‌లు పూర్త‌య్యేంత వ‌ర‌కూ ఉన్నారు.

Bathukamma celebrations in Australia

ఈ బతుకమ్మ వేడుకలకు సమన్వయకర్తలుగా రామ్ రెడ్డి గుమ్మడవాలి, సుమేషు రెడ్డి సూర్య, శశి మానేం, గోవెర్దన్ రెడ్డి, హారిక మానేం, కవిత రెడ్డి, ప్రశాంత్ కడపర్తి , వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో సునీల్ కల్లూరి, మిథున్ లోక, వినయ్ యమా, ప్రదీప్ తెడ్ల, , అనిల్ మునగాల, సందీప్ మునగాల, హారిక మన్నెం, వాత్సహాల ముద్దం, కిశోరె రెడ్డి, నటరాజ్ వాసం, డేవిడ్ రాజు, ఇంద్రసేన్ రెడ్డి, పాపి రెడ్డి, నర్సింహా రెడ్డి, ప్రమోద్ రెడ్డి, వాసు టూట్కుర్, లతా కడపర్తి, సాయి కిరణ్ చిన్నబోయిన, ప్రదీప్ సేరి, ప్రదీప్ తెడ్ల, వినోద్ ఏలేటి, వినయ్ కుమార్, కిశోరె యాదవ్, కిరణ్ అల్లూరి, పద్మిని చాడ, సంగీత కోట్ల, రాజేష్ అర్షణపల్లి, పాపి రెడ్డి, అశోక్ మాలిష్, ఇంద్రసేన్ రెడ్డి, ప్రమోద్ ఏలేటి, కావ్య గుమ్మడవాలి మరియు ఇతర సంగాల అధ్యక్షలు తదితరులు పాల్గొన్నారు.

English summary
Bathukamma celebrations held in Australia by Telangana people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X