వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికాలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పెన్సిల్వేనియా తెలంగాణ అసోసియేషన్(పిటిఏ) ఆధ్వర్యంలో పెన్సిల్వేనియాలోని అప్పర్ మెరియన్ ప్రాంతంలో బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు. గత శనివారం ఉదయం 11గంటల నుంచి రాత్రి 7గంటల వరకు వేడుకలు నిర్వహించారు.

ఈ వేడుకల్లో 300కు పైగా మహిళలు పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు పాడుతూ.. నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమానికి మిస్ సౌత్ ఏసియా 2014 త్రిష గూడూరు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆమె యునిసెఫ్‌కు గ్లోబల్ అడ్వకేట్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలోని వరంగల్‌లో జిల్లాలో జన్మించిన త్రిష ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందడం తమకు గర్వంగా ఉందని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలిపారు.

అందమైన పూలతో పేర్చిన బతుకమ్మలను తీసుకొచ్చిన మహిళలు చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో సందడి చేశారు. మహిళలతోపా త్రిష కూడా బతుకమ్మ ఆడుతూ.. నృత్యాలు చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాంస్కృతి సాంప్రదాయాలకు అద్దంపట్టేలా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అందమైన బతుకమ్మలు రూపొందించిన మహిళలకు బహుమతులు కూడా ప్రదానం చేశారు.

మేఘనా-వేణు బత్తిని, అలేఖ్య, మల్లికా బోల్ల, రమదాదేవి, రాజు కక్కెర్లకు లక్ష్మీదేవి చిత్రం కలిగిన వెండి నాణేలు అందజేశారు. వెంకట్ మడిపడగ, శ్రీధర్ గుడాల, రాజు కక్కెర్ల, హరి బండిగారి, నరేందర్ ఆకుల, సత్య పెద్దిరెడ్డి, ఆనంద్ బల్నగారి, మల్లిక బోల్ల, చైతన్య రంగినేని, రాజేష్ ఎసారపు, పవన్ ధనపునేని, శ్రీధర్ తాడూరి, రఘు వడ్ల, విద్యాసాగర్ మారం కార్యక్రమ ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా వ్యవహరించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి జరిపిన బతుకమ్మ వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికీ పిటిఏ అధ్యక్షుడు వెంకట్ మడిపడగ కృతజ్ఞతాభినందనాలు తెలిపారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

అమెరికాలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పెన్సిల్వేనియా తెలంగాణ అసోసియేషన్ (పిటిఏ) ఆధ్వర్యంలో పెన్సిల్వేనియాలోని అప్పర్ మెరియన్ ప్రాంతంలో బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

గత శనివారం ఉదయం 11గంటల నుంచి రాత్రి 7గంటల వరకు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో 300కు పైగా మహిళలు పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు పాడుతూ.. నృత్యాలు చేశారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

ఈ కార్యక్రమానికి మిస్ సౌత్ ఏసియా 2014 త్రిష గూడూరు ముఖ్య అతిథిగా విచ్చేశారు. తెలంగాణలోని వరంగల్‌లో జిల్లాలో జన్మించిన త్రిష ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందడం తమకు గర్వంగా ఉందని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలిపారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి జరిపిన బతుకమ్మ వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికీ పిటిఏ అధ్యక్షుడు వెంకట్ మడిపడగ కృతజ్ఞతాభినందనాలు తెలిపారు.

English summary
Bathukamma celebrations held in America organised by Pennsylvania Telangana Association(PTA).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X