వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో భారతీయులకు భారీ ఊరట: హెచ్1బీ వీసా భాగస్వాములూ పనిచేసుకోవచ్చు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాలు నివాసం ఉంటున్న భారతీయులకు భారీ ఊరట లభించింది. హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు కల్పించిన పని అనుమతులను రద్దు చేయాలన్న అమెరికా ప్రభుత్వ ఆదేశాల్ని అక్కడి కోర్టు తాత్కాలిక నిలిపేయాలని స్పష్టం చేసింది.

2015లో బరాక్ ఒబామా..

2015లో బరాక్ ఒబామా..

ఈ నిర్ణయాన్ని పున:పరిశీలించాలని యూఎస్ కోర్ట్స్ ఆఫ్ అప్పీల్ కొలంబియా సర్క్యూట్ దిగువ కోర్టును కోరింది. నిబంధనల్ని క్షుణ్ణంగా పరిశీలించి తుది నిర్ణయానికి రావాలని ఆదేశించింది. అప్పటి వరకు నిబంధనలను నిలుపుదల చేయడం ఉత్తమమని తేల్చి చెప్పింది. అంతేగాక, తుది తీరపును కూడా నిలిపివేయాలని కోరింది. హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు పని అనుమతులు కల్పిస్తూ బరాక్ ఒబామా ప్రభుత్వం హెచ్4వీసా విధానాన్ని 2015లో ప్రవేశపెట్టింది.

భాగస్వాములు కూడా..

భాగస్వాములు కూడా..

అయితే, ఈ విదానం వల్ల అనేక మంది అమెరికా పౌరులు నష్టపోతున్నారని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భావించింది. ఆ తర్వాత హెచ్4 వీసా నిబంధనలను కఠినతరం చేయాలని నిర్ణయించింది. అలాగే పలు చర్యలు కూడా చేపట్టింది. అయితే, తాజాగా కోర్టు ఇచ్చిన ఆదేశాలతో భారతీయులకు భారీ ఊరట లభించినట్లయింది. హెచ్1బీ వీసాదారుల భాగస్వాములు కూడా అమెరికాలో పనిచేసుకునే అవకాశం వచ్చింది.

ఆరోగ్య బీమా పాలసీనే..

ఆరోగ్య బీమా పాలసీనే..

కాగా, ఇటీవల ప్రవేశపెట్టిన ఆరోగ్య బీమా పాలసీ కష్టతరంగా మారింది. అమెరికాకు వలస రావాలని ప్రయత్నించే వారికి ఆరోగ్య బీమా లేనివారు, వైద్య ఖర్చుల్ని సొంతంగా భరించగలమని నిరూపించుకోలేనివారు ‘ఇమ్మిగ్రైంట్ వీసా' ద్వారా రావడాన్ని ఇకపై అనుమతించరు.

బీమా, లేదా ఆర్థిక పరపతిపై ఏదో ఒక ఆధారాన్ని వీసా పరిశీలన పూర్తయ్యేలోగానే చూపించడం అనివార్యం. ఆ తర్వాత, లేదా అమెరికాలో ప్రవేశించాక వీటిని ఇస్తామంటే అంగీకరించరు. ఆరోగ్య రక్షణ వ్యవస్థను, పన్ను చెల్లింపుదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కాగా, అమెరికాలో అడుగుపెట్టిన 30 రోజుల్లోగా ‘ఆమోదిత ఆరోగ్య బీమా'ను పొందడం వలసదారులకు ఇక తప్పనిసరి కానుంది. లేదంటే వైద్య ఖర్చులను భరించగల ఆర్థిక వనరులనైనా కలిగి ఉండాలి.

English summary
Big Relief for Indians: Spouses of H1B visa holders can continue to work in US.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X