వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాంబు బెదిరింపు: భారత సంతతికి చెందిన అమెరికా కంపెనీ సీఈఓ అరెస్ట్
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై విమానాశ్రయంలో బాంబు వున్నట్లు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడిన ఆరోపణలపై అమెరికాలోని ఓ కంపెనీకి సీఈఓగా విధులు నిర్వహిస్తున్న వినోద్ మూర్జానీని పోలీసులు అరెస్ట్ చేశారు.

మంగళవారం ఉదయం వచ్చిన ఈ బాంబు బెదిరింపు కాల్‌తో అనేక విమానాల రాకపోకలలో జాప్యం చోటు చేసుకుందని అధికారులు చెప్పారు. తాను ముంబై నుండి ఢిల్లీకి వెళ్లే విమానం అందుకునేందుకు ఈ బూటకపు ఫోన్ కాల్ చేసినట్లు విమానాశ్రయంలో అరెస్టయిన వినోద్ మూర్జానీ చెప్పారు.
కాగా, టెలిఫోన్ బూత్‌లోని సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా వినోద్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తన భార్య, పిల్లలతో వర్జీనియాకు వెళ్లే క్రమంలో వినోద్ ఈ తప్పుడు కాల్ చేసి పోలీసులకు చిక్కడం గమనార్హం.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!