వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశం కాని దేశంలో తెలంగాణ సంస్క‌ృతి.. టాంజానియాలో ఘనంగా బోనాల సంబురాలు

|
Google Oneindia TeluguNews

టాంజానియా : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రవ్యాప్తంగా బోనాలు వేడుకలు కనులపండువగా జరుగుతున్నాయి. ఇక కాంక్రీట్ జంగిల్‌లా మారిన హైదరాబాద్‌లోనూ బోనాల సందడి అంతా ఇంతా కాదు. ఆషాఢ మాసం మొదలు గోల్కోండ నుంచి మొదలు పెట్టి అటు సికింద్రాబాద్ లష్కర్, ఇటు పాతబస్తీ లాల్ దర్వాజ వరకు బోనాల వేడుకలు జరిగే తీరు ఎంతగానో ఆకట్టుకుంటాయి.

bonalu festival held in grand way at tanzania

ఆ క్రమంలో విదేశీ గడ్డపై ఉంటున్న తెలంగాణ బిడ్డలు తమ సంస్కృతిని మరిచిపోకుండా బోనాల జాతరను వైభవంగా జరుపుకున్నారు. టాంజానియాలో స్థిరపడిన తెలంగాణ కుటుంబాలు జరుపుకున్నారు. దార్ ఎస్ సలాం సముద్ర తీరంలో బోనాల వేడుకలు అంబరాన్ని తాకాయి.
తెలంగాణ సాంస్కృతిక సంఘం టాంజానియా ఆధ్వర్యంలో జరిగిన బోనాల ఉత్సవాలు తెలంగాణ సంప్రదాయాల్ని ప్రతిబింబించాయి.

bonalu festival held in grand way at tanzania

చిననాటి దోస్తులు, గ్రామ ప్రజలు.. ఆత్మీయ కలయిక.. జన్మభూమిలో కేసీఆర్ సందడిచిననాటి దోస్తులు, గ్రామ ప్రజలు.. ఆత్మీయ కలయిక.. జన్మభూమిలో కేసీఆర్ సందడి

సంప్రదాయ పద్దతిలో వస్త్రధారణ, భక్తిశ్రద్దలతో అమ్మవారికి బోనాలు.. ఇలా అన్నిరకాలుగా టాంజానియా గడ్డపై తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పారు. బోనాలతో పాటు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని కుటుంబాలతో సహా ఆనందంగా గడిపారు. చిన్నా పెద్దా చిందులు, బోనాల పాటలు వెరసి సందడి నెలకొంది.

తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఛైర్మన్ పిట్టల సత్యనారాయణ, వైస్ ఛైర్మన్ నందకిషోర్ బొల్లక్‌పల్లి, సలహా కమిటీ సభ్యులు వంగా నరసింహరెడ్డి, భాస్కర్ రెడ్డి, పట్లొల్లా సంతోష్ రెడ్డి, కార్యదర్శి పదవితో పాటు కోశాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీనివాస్ సిరిపురం, సాంస్కృతిక కార్యదర్శి జిల్లా నాగరాజు ఆధ్వర్యంలో బోనాలు వేడుకలు ఘనంగా నిర్వహించి పలువురి ప్రశంసలు అందుకోవడం విశేషం.

bonalu festival held in grand way at tanzania

మీరు ఎన్నారైలా? మీ సమస్యలు తెలుగువారితో పంచుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీకు వన్ ఇండియా తెలుగు అండగా ఉంటుంది. అంతేకాదు విదేశీగడ్డపై తెలుగు సంస్కృతి సంప్రదాయాలు చాటే సంబురాలు, సంతోషాలు, వివిధ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వన్ ఇండియా టీమ్‌కు పంపించండి. పాఠకులతో పంచుకోండి. మీరు పంపే వార్తలు, సలహాలు, సూచనలు [email protected] కు మెయిల్ చేయండి.

English summary
Bonalu Festival held in a grand way at tanzania. Telugu people celebrates bonalu as one of the family and spent happily for one day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X