వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లండన్‌లో బోనాల జాతర..! అంగరంగ వైభవంగా ఉత్సవాలు..!!

|
Google Oneindia TeluguNews

లండన్/హైదరాబాద్ : తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో లండన్ లోని క్రాన్ఫోర్డ్ కాలేజీలో బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ సంబరాలకు బ్రిటన్ నలుమూలల నుంచి సుమారు 600లకు పైగా తెలంగాణ కుటుంబ సభ్యులుహాజరు కావడం తరలివచ్చారు. ఈ వేడుకలకు లండన్ ఎంపీ వీరేంద్రశర్మ, సీమ మల్హోత్రా, భారత రాయబారి ఉన్నతాధికారు కెఇవోమ్ ముఖ్య అతిథులు హాజరై పండుగకు ప్రత్యేక శోభను తెచ్చారు.

అనంతరం వారు అక్కడ నివసిస్తున్న తెలుగువారిని ఉద్దేశించి ప్రసంగించారు. లండన్ ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి ప్రచారంలో తెలుగు వారు మొదటి స్థానం లో ఉన్నారని తెలిపారు. ఎనిమిదేళ్లుగా లండన్ లో జరుగుతున్న బోనాల్లో పాల్గొనడం గర్వంగా ఉందని తెలిపారు. లండన్ ఎంపీ సీమా మల్హోత్రా మాట్లాడుతూ ఇంగ్లాండ్ గడ్డ పై తన నియోజకవర్గంలో బోనాల నిర్వహణ, మన హిందూ సాంప్రదాయ పరిరక్షణకి దోహదం చేస్తుందన్నారు.

Bonalu in London.!A Telangana Festive celebrations..!!

ఫౌండర్ చైర్మన్ గంప వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా విదేశాల్లో మొట్ట మొదటి సారి బోనాలు ( 2011 లో) నిర్వహణ, నా ప్రయత్నానికి సహకరించి ఈ రోజు విశ్వవ్యాప్తంగా బోనాలు నిర్వహణకి దోహద పడ్డ అందరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ ఆచారాల్ని, సాంప్రదాయాల్ని ప్రచారం చేసే బాధ్యత, సేవా దృక్పథంతో సంస్థ పని చేస్తుందని సంస్థ నియమాల మేరకు కలిసి వచ్చే అందరితో పని చేస్తుందని తెలిపారు.

ఉపాధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ సంస్కృతి ప్రచారం తరాలు మారిన మన వారికి మన సాంప్రదాయాలు మరిచిపోకుండా చేస్తుందన్నారు. ఉపాధ్యక్షులు ప్రవీణ్‌ రెడ్డి, రంగు వెంకట్‌ పాల్గొన్నారు.సంస్కృతి ప్రచారంలో భాగస్వామ్యమై బోనాలు నిర్వహించిన, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు చేసిన వారికి బహుమతి లు అందచేశారు. భారీ ఖర్చుతో కూడుకున్న ఈ బోనాల నిర్వహణ ఎనిమిదేళ్లుగా నిర్విరామంగా కొనసాగించడానికి సహకరించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు.

English summary
The Bonala Festival was held in London at Cranford College under the aegis of the Telangana NRI Forum. More than 600 Telangana family members from all over Britain flocked to attend the festivities. The ceremony was attended by key guests of London MP Veerendra Sharma, Seema Malhotra and Indian Ambassador Keiwom.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X