వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లండన్‌లో ప్రొఫెసర్ జయశంకర్‌ జయంతి వేడుకలు

|
Google Oneindia TeluguNews

లండన్: తెలంగాణ ఎన్నారై ఫోరం,ఎన్నారై టిఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్దాంత కర్త దివంగత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకులని లండన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంకి యుకె నలుమూలల నుంచి తెలంగాణ వాదులు, టిఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ముందుగా జయశంకర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాలర్పించారు. అనంతరం కొవ్వొత్తులతో తెలంగాణ అమరవీరులను, జయశంకర్‌లను, ఇటీవల దివంగతులైన భారత
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంని స్మరిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండునిమిషాలు మౌనం పాటించారు.

ఆ తర్వాత సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. తెలంగాణ భావజాల వ్యాప్తిలో జయశంకర్ పాత్రా గొప్పదని, వారు చివరి వరకు తెలంగాణ రాష్ట్రసాధన కోసమై పని చేశారని అన్నారు. అటువంటిది తెలంగాణా రాష్ట్ర ఏర్పాటైన సంతోష సందర్భంలో ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు.

అనుకున్న ఆశయ సాధనకై వారు చేసిన కృషి ప్రతి వ్యక్తి జీవితంలో ఆదర్శంగా తీసుకోవాలని, వారి జీవిత వృత్తాంత్రాన్ని పాఠ్యపుస్తకాల్లో పెట్టాలని, ట్యాంక్ బ్యాండ్‌పై జయశంకర్ కాంస్య విగ్రహాన్ని పెట్టాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

celebraciones de cumpleaños Of Prof. Jayashankar in London

ప్రవాస తెలంగాణ సంఘాలు అన్ని ఆచార్య జయశంకర్ మానస పుత్రికలని, వారి ఆశయాలకు అనుగుణంగా మనం తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొనాలని తెలిపారు. ప్రస్తుతం ఎన్నారై ఫోరమ్-ఎన్నారై టిఆర్ఎస్ సెల్ చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి సభకు వివరించారు.

ఇటీవల దివంగతులైన భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం దేశ పౌరులకి, ముఖ్యంగా యువతకు ఇచ్ఛిన్న స్పూర్తి చాలా గొప్పదని, ప్రతి ఒక్కరూ వారి ఆశయాలకు అనుగుణంగా
నడవడమే వారికి మనమిచ్చే ఘన నివాళి అని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై టిఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు, టిఈఎన్ఎఫ్ కో ఫౌండర్ అనీల్ కుర్మాచలం, టిఈఎన్ఎఫ్ అధ్యక్షుడు సీక చందు గౌడ్, కరీంనగర్ టిఆర్ఎస్ నాయకుడు తిరుపతి రెడ్డి కాసర్ల, జనరల్ సెక్రటరీ అశోక్ గౌడ్ దుసరి, ఈవెంట్ ఇంఛార్జ్ నాగేష్ రెడ్డి కాసర్ల, లండన్ ఇంఛార్జ్ రత్నాకర్, స్పోర్ట్స్ ఇంఛార్జ్ నరేష్, సెక్రటరీ నవీన్ రెడ్డి, ఐటి సెక్రటరీ శ్రీకాంత్ జళ్ల, రాజేష్ వర్మ, కల్చరల్ సెక్రటరీ శ్వేతా రెడ్డి, నిర్మల, జ్యోతి రెడ్డి, ఏజ్ లింక్ ఛారిటీ సభ్యుడు రాజ్ బల్రాజ్, తదితరులు పాల్గొన్నారు.

English summary
Celebraciones de cumpleaños Of Prof. Jayashankar held in London by Telangana NRI Forum and TRS Cell.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X