• search
  • Live TV
చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కువైట్‌లో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు..అన్నదానం నిర్వహించిన కువైట్ టీడీపీ అధ్యక్షుడు సుధాకరరావు

|

ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కువైట్‌లో ఘనంగా జరిపారు టీడీపీ కువైట్ అధ్యక్షుడు కురదవల్లి సుధాకరరావు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కువైట్‌‌లోని నారా నందమూరి అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కువైట్‌లో అన్నదానకార్యక్రమం కూడా నిర్వహించారు. ప్రస్తుతం కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కువైట్‌లో ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలకు భోజనం ప్యాకెట్లు మరియు మంచి నీటి బాటిల్స్‌ను పంపారు. అన్నదాన కార్యక్రమంలో కీలకంగా వ్యవహరించిన నరసింహనాయుడు , విశ్వకు సుధాకరరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు. సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవడంలో చంద్రబాబు దిట్ట. ఎక్కడైనా తన స్థానం సుస్థిరం చేసుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. కేంద్రంలో చక్రాలు తిప్పినా... స్వరాష్ట్రంలో ఓటములు చవిచూసినా తిరిగి అధికారం దక్కించుకోవడం, విలక్షణ రాజకీయం, ఆయన ప్రత్యేకత. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా 15 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా సుదీర్ఘ పొలిటికల్ బ్రైట్ కెరీర్ ఆయన సొంతం. రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు తెలుగు రాజకీయ పరమపదసోపాన పఠంలో నిచ్చెనలు ఎక్కినా...

 Chandrababu Birthday celebrations in Kuwait

అదే స్థాయిలో కిందపడినా పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోగల నేర్పరి. ఎవరితోనూ ఆయన్ను పోల్చలేము. ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రంలోనే సీనియర్ పొలిటీషియన్‌గా నేడు 70వ ఏటాలోకి అడుగుపెట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాజకీయంగా పలుమార్లు గ్రహణం పట్టినా... తెలుగు రాజకీయాల్లో పౌర్ణమి చంద్రుడిలా వెలుగొందారు. చంద్రబాబు అంటే చంద్రబాబే.70 ఏళ్ల వయస్సులోనూ ఏమాత్రం రాజీపడని ఆయన రాజకీయపోరాట స్ఫూర్తిని ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తారు.

 Chandrababu Birthday celebrations in Kuwait

ఇక చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులు ఇంట్లో జరుపుకున్నారు. కేక్ కట్ చేసిన చంద్రబాబు భార్య భువనేశ్వరి, కొడుకు నారాలోకేష్‌లకు తినిపించారు. ఇక కాసేపు మనవడు దేవాన్ష్‌తో సరదాగా గడిపారు చంద్రబాబు. ఈ సారి చంద్రబాబు కట్ చేసిన కేక్‌కు ప్రత్యేకత ఉంది. చంద్రబాబు ధరించే చొక్కా ఆకారంలో కేక్ తయారు చేయించారు. లాక్‌డౌన్ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు హైదరాబాద్‌లోని తన నివాసంలోనే గత కొద్దిరోజులుగా ఉంటున్నారు. అయినప్పటికీ తాను ఎక్కడున్నా తన మనసంతా ఏపీ పైనే ఉంటుందని పలుమార్లు చెప్పుకొచ్చారు.

English summary
TDP Chief Chandrababu Naidu's birthday celebrations were celebrated in a grand mamer in Kuwait amid the lockdown. Kuwait TDP president Kuradavalli Sudhakar Rao had distributed food packets and water bottles for the Telugu people residing in Kuwait
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more