• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవం

|
Google Oneindia TeluguNews

గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వున్న 65కుపైగా తెలుగు సంఘాల భాగస్వామ్యంతో 25 దేశాలలోని తెలుగు పిల్లలతో ఘనంగా వర్చువల్ పద్దతిలో 12 గంటలపాటు నిర్విరామంగా పూర్తిగా "బాలలచేత - బాలలకోసం" బాలల దినోత్సవ కార్యక్రమాన్ని అంగరంగవైభవంగా నిర్వహించారు.

ఈ ర్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తమ సందేశాన్నిపంపించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ముందు తరాలకు అందచేసే క్రమంలో ముందుగా మనకట్టు, బొట్టు, ఆట, పాట, పండుగలు, పబ్బాలను పిల్లలకు పరిచయం చేయాలని.. దానికి బాలలదినోత్సవం లాంటి సందర్బాన్ని వినియోగించు కోవటం సంతోషం అన్నారు. ముఖ్యంగా మనసంస్కృతికి మూలమైన మాతృభాషను పిల్లలకు నేర్పించాలని మన శతక పద్యాలు, కథలు వారికి తెలియచేయాలని అన్నారు. ఈ కార్యక్రమ స్పూర్తితో భవిష్యత్తులో మరిన్ని సంస్థలు విద్యార్దులను మనవైన విలువలతో తీర్చిదిద్దేవిధంగా ముదుకుసాగాలని కోరుతూ నిర్వాహకులకు అభినందనలు తెలియచేస్తూ పిల్లలందరికి ఆశీస్సులుఅందజేశారు.

 children day celebrations held by Gulf Telugu associations

ప్రత్యేకఅథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉపసభాపతి మండలి బుద్ద ప్రసాద్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో 300 దికిపైగా వివిధ దేశాలలో ఉంటున్న తెలుగు పిల్లలు ప్రదర్శించటం చాలా కన్నుల పండుగగా ఉందన్నారు. ఇలాంటి పిల్లలపండుగను నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు తెలియచేశారు.

మరొక గౌరవ అతిథిగా పాల్గొన్న గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. విదేశాల్లో ఉన్నాకాని మన సంస్కృతి సంప్రదాయాలు, బాషను మర్చిపోకుండా పూర్తిగా పిల్లలతో ఇంతపెద్ద కార్యక్రమం నిర్వహించటం సంతోషమన్నారు. వారి ప్రదర్శనలను తిలకించి మైమరచిపోయానన్నారు. మరొక అతిథిగా విచ్చేసిన వంశీ ఇంటర్నేషనల్ అధినేత రామరాజు మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి పౌరులని, పిల్లలతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటం అందునా అన్నిరకాల ప్రదర్శనలు చేయటం చాలాసంతోషమన్నారు.

ఇంకా అతిథులుగా మారిషస్ నుండి ప్రముఖ వ్యక్తి సంజీవ నరసిమ్హ అప్పడు, మలేసియా తెలుగు సంఘం అధ్యక్షులు డాక్టర్ ప్రతాప్, సింగపూర్ సాంస్కృతిక కళాసారధి అధ్యక్షులు రత్నకుమార్, శుబోదయం ఇంఫ్రా చైర్మన్ లక్ష్మి ప్రసాద్, తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి పాల్గొన్నారు.
కార్యక్రమ నిర్వాహకులు కుదరవల్లి సుధాకర రావు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన 65 తెలుగు సంఘాల అధ్యక్షులకు, ఎంతో ఉత్సాహంతో పాల్గొన్న పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియచేశారు. ఈ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పిల్లల కోసం రెండు వయస్సుల గ్రూపులవారికి అంటే 5 నుంచి 10, 11 నుంచి 16 సంవత్సరాల వయస్సు వారికి నిర్వహించిన క్యిజ్ పోటీల విజేతలని ప్రకటించారు. ఇంతటి భారీ కార్యక్రమానికి రూపకల్పన, నిర్వహణలో అన్నివిధాల తనతో ఉండి ఈ విజయంలో ముఖ్యపాత్రను పోషించిన విక్రం సుఖవాసికి, వెంకప్ప భాగవతులకి, ప్రదీప్ కుమార్, ఎం.బి. రెడ్డి, గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్యలోని భాగస్వామి సంఘాల అధ్యక్షులకు, వారి కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలియచేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య స్పాన్సర్‌గా స్విఫ్ లెర్న్ సంస్త వారు, ప్లాటినం స్పాన్సర్‌గా శుబోదయం ఇంఫ్రా వారు, గోల్డ్ స్పాన్సర్‌గా కుదరవల్లి ఫౌండేషన్ వారు ఉండి తమ సహయాన్ని అందించారు. అలాగే మీడియా పార్టనర్స్‌గా కువైట్ అంధ్రా, మాగల్ఫ్ వారు వ్యవహరించగా సంకేతిక సహకారాన్ని సింగపూర్ సంస్థ ఆర్కే మీడియా వారు అందించారు.

తెలుగు సంఘాల ఐఖ్య వేదిక కువైట్ అధ్యక్షులు కుదరవల్లి సుధాకర రావు, సౌది తెలుగు అసోషియేషన్ అధ్యక్షురాలు దీపిక రావి, తెలుగు కళా సమితి ఓమన్ అధ్యక్షులు అనిల్ కుమార్ కడించెర్ల, ఆంధ్ర కళా వేదిక ఖతార్ అధ్యక్షులు సత్యనారణ మలిరెడ్డి, ఫుజైరా తెలుగు కుటుంబాలు అధ్యక్షులు వేద మూర్తి, తెలుగు తరంగిణి రాస్ అల్ ఖైమా అధ్యక్షులు వెంకట సురేష్.. పిల్లలు జీవితంలో అలవర్చుకోవలసిన వివిధ అంశాలైన క్రమశిక్షణ, నిజాయితీ, నిజం, ఆత్మ విశ్వాసం, సానుకూల దృక్పథం, సహాయం చేయడం, జ్ఞానము, ఏకాగ్రత లాంటి పిల్లలకు ప్రేరణ కలిగించే అంశాలమీద ప్రసంగించి వారిని ఉత్తేజ పరిచారు. ఈ 12 గంటల కార్యక్రమానికి ప్రతేక ఆకర్షణ పిల్లలే వ్యాఖ్యాతలుగా ఉండటం, పిల్లలచే వివిధ అంశాలమీద చర్చా వేదికలు, ప్రసంగాలు చేయించటం.

English summary
children day celebrations held by Gulf Telugu associations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X