వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో 21 అడుగుల బతుకమ్మ

By Pratap
|
Google Oneindia TeluguNews

డల్లాస్: అక్టోబర్ 9వ తేదీన అమెరికాలోని అలెన్ టెక్సాస్ సౌత్ ఫోర్క్ రాంచ్‌లో డేటా ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. తాము నిర్వహించిన బతుకమ్మ, దసరా పండుగ వేడుకలకు వఛ్చిన తెలుగు ప్రజలందిరికి డేటా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసింది.

ఆహ్లాదకరమైన వాతావరణం మరియు చక్కటి పచ్చిక బయలు ప్రాంతం లో జరిగిన ఈ వేడుకలకు ప్రవాస తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్సహాంగా పాల్గొన్నారు. సుమారు సాయంత్రం 4:00 గంటల సమయం లో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో లాంటి పాటలతో ఈ వేడుకలు మొదలయ్యాయి.

ఈ వేడుకలకు వఛ్చిన ఆహ్వానితులందరిని డేటా (DATA) నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. ఉత్సవ ప్రాంగణం లో వున్న 21 అడుగుల ఎత్తు గల బతుకమ్మ అక్కడికి వఛ్చిన ప్రజలందిరిని ముగ్దులను చేసింది. మహిళలందరిని పిలిచి బతుకమ్మ చైర్ సంధ్య గవ్వా బతుకమ్మ వేడుకలను మొదలుపెట్టారు. ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 7వ తేదీ వరకు DATA నిర్వహించిన "ఊరూరా బతుకమ్మ" విశేషాలను, ప్రామ్యుఖ్యత ను తెలియ చేశారు.

DATA celebrates annual Bathukamma and Dasara Panduga in Dallas

సాయంత్రం 6 గంటల వరకు, సుమారు 700 మంది మహిళలు, 300 బతుకమ్మలతో, ఉత్సవ ప్రాంగణమంతా పండుగ వాతావరణం సంతరించుకుంది. బతుకమ్మ నిమజ్జనం సమయంలో ఆదిత్యా గ్రూప్ నిర్వహించిన band కార్యక్రమం ఎంతో ఆకర్షణగా నిల్చింది. 10 ఉత్త్తమ బతుకమ్మలకు తెలంగాణ రాష్ట్రం లో తయారైన చీరలను బహుకరించారు.

బతుకమ్మ నిమజ్జనం తర్వాత భాస్కర్ అర్రోజు - దసరా పూజ ప్రకటించి..పూజను మొదలుపెట్టారు. పూజ ప్రాంగణంలో జై మాత కి , దుర్గా మాత కి నినాదాలతో మార్మోగింది. పూజ అనంతరం రావణ దహనం కార్యక్రమం కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు.

తర్వాత, డాటా కల్చరల్ చైర్ పద్మశ్రీ - తెలంగాణ నుండి వఛ్చిన కళాకారులు దినకర్, సుమంగళి, వంశీప్రియ, మిట్టపల్లి సురేందర్‌లను వేదిక పైకి ఆహ్వానించి , పరిచయం చేశారు. కళాకారులందరూ తమ పాటలతో, జానపద గేయాలతో ప్రేక్షకులకు ఎంతో కనువిందు కలిగించారు. అంతే కాకుండా, చిన్న పిల్లలు, మహిళలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి.

మిట్టపల్లి సురేందర్ డేటా సంస్థ కొరకు రాసిన ప్రత్యేక పాటను ఆలాపించి ప్రేక్షకులను ఆశ్చర్య చకితులను చేశారు.

కార్యక్రమ నిర్వాహకురాలు వంశీప్రియ, ప్రెసిడెంట్ రామ్ కాసర్లను ఆహ్వానించి వేడుకల గురించి, సంస్థ గురించి, వేడుకల సన్నాహాల గురించి కొన్ని మాటలు చెప్పామన్నారు. ఈ సందర్బంగా మాట్లడుతూ, ఊరూరా బతుకమ్మ నిర్వహించిన ఈ సంవత్సరం లో ప్రెసిడెంట్ గా ఉండడం తనకు ఎంతో గర్వాంగా ఉందన్నారు. ఊరూరా బతుకమ్మ నిర్వహణలో DATA కు సహాయ సహకారాలు అందించిన వివిధ ప్రాంతాల ప్రజలకు, దాతలకు ధన్యవాదాలు తెలిపారు.

ఈవెంట్ కన్వీనర్ మహేందర్ ఘనపురం మాట్లాడుతూ ఈ వేడుకలకు సమావేశకర్త గా ఉండడం ఎంతో గర్వాంగా, సంతోషంగా ఉందన్నారు. మహేందర్ ఇతర కో-కన్వీనర్ లను పరిచయం చేస్తూ వారికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ వేడుకలు ఎంతో విజయవంతంగా, ఘనంగా జరగడానికి సహకరించిన వాలంటీర్లకు, దాతలకు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

DATA ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బతుకమ్మ, దసరా పండుగకు తమ వంతు సహాయాన్ని అందించి సంఘీభావం తెలిపిన IANT, TANTEX, ATA, NATA, TATA, Telangana Jagruthi, TANA, NATS, ATA-Telangana, TEA, ATA సంఘాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

English summary
Dallas Area Telangana Association (DATA www.dataus.org ) celebrated annual Bathukamma & Dasara Panduga in Dallas Texas USA, Over 3500 people from all walks of life attending this fun filled event/festival
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X