ప్రసాద్ తోటకూరకు డిఐఎల్ క్లబ్ అవార్డ్

డల్లాస్: అమెరికాలోని డల్లాస్‌లో డల్లాస్ ఇండియన్ లయన్స్ క్లబ్ తమ వార్షికోత్సవం సందర్భంగా మే 17న అత్యుత్తమ సేవలు అందించిన వారికి అవార్డులను అందజేశారు. డల్లాస్ ఇండియన్ లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు షబ్నమ్ మోద్గిల్ ప్రతిష్టాత్మక మెల్విన్ జోన్స్ అవార్డులను వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన ముగ్గురికి అందజేశారు.

అవార్డులు అందుకున్న వారిలో నార్త్ టెక్స్ మహాత్మాగాంధీ మెమోరియల్ ఛైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూర, డాక్టర్ సచీన్ మెహతా, డల్లాస్ ఇండియన్ లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు మహేష్ పటేల్ ఉన్నారు. లయన్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను డాక్టర్ రఘునాథ్ సింగ్, గ్రాసరూట్స్ లయన్ ఆఫ్ ది ఇయర్ సతీష్ షా, ప్రెసిడెంట్ అవార్డు మహేష్ పటేల్ అందుకున్నారు.

DIL Club presents prestigious Melvin Jones Award to Prasad Thotakura

ఇటీవల రాష్ట్రపతి చేతులమీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న అశోక్ మాగోకు షబ్నమ్ మోద్గిల్‌ ప్రత్యేక అవార్డును ప్రదానం చేశారు. అవార్డుల ప్రదానోత్సవం అనంతరం యూనివర్సిటీ ఆఫ్ డల్లాస్‌కు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

కమేడియన్ పాల్ వర్గీస్ తన ప్రదర్శనతో అలరించారు. ఈ కార్యక్రమంలో 300 మంది ఎన్నారైలతోపాటు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసిన వారందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+