వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వ విభాగంపై విమర్శ: యూఏఈలో భారతీయుడికి భారీ జరిమానా

|
Google Oneindia TeluguNews

అబూదాబి: యూఏఈ(యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్) రవాణా విభాగాన్ని విమర్శిస్తూ ఇ-మెయిల్ పెట్టినందుకు ఓ భారతీయ కార్మికుడికి సుమారు రూ.87లక్షల భారీ జరిమానా విధించింది ఆ దేశం. కొద్ది నెలల క్రితం డ్రైవింగ్ లైసెన్స్ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన ఆ కార్మికుడు.. విమర్శలతో కూడిన మెయిల్‌‌ను రవాణా విభాగానికి ఇ మెయిల్ చేశాడు.

ఉద్దేశపూర్వకంగానే పేదలను అర్హత పరీక్షలో ఫెయిల్ చేసి, వారు మళ్లీ మళ్లీ పరీక్షలకు హాజరయ్యేలా రవాణా విభాగం ఇబ్బందులకు గురిచేస్తోందని ఆ 25ఏళ్ల భారతీయుడు విమర్శించాడు. అంతేగాక, అలా పేదల నుంచి డబ్బు దోచుకుంటోందని ఆరోపించాడు.

Dubai court fines Indian man $136,000 for RTA insult

ఈ క్రమంలో తమను అవమానించేలా, చులకన చేసేలా సదరు మెయిల్ ఉందని పేర్కొంటూ.. రవాణా విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు నేరం అంగీకరించకపోయినా.. దుబాయ్ కోర్టు తీర్పుతో అతడ్ని 3నెలలపాటు జైల్లో పెట్టారు. అంతేగాక, అతనికి కోర్టు రూ. 87లక్షల జరిమానా కూడా విధించింది. ఇదీగాక, శిక్ష పూర్తయిన తర్వాత అతడ్ని దేశం నుంచి పంపించేయాలని ఆదేశించింది.

English summary
Dubai’s Court of First Instance has sentenced an Indian worker to a Dhs500,000 ($136,125) fine and three months in prison for accusing the Roads and Transport Authority (RTA) of ripping off the poor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X