వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూజిలాండ్‌లో ముందే దీపావళి

By Pratap
|
Google Oneindia TeluguNews

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లోని అతి పెద్ద నగరం ఆక్‌లాండ్‌లో భారతీయులు ముందే దీపావళి వేడుకలు జరుపుకున్నారు. దీపావళి పర్వదినం మరో పక్షం రోజులు ఉండగానే న్యూజిలాండ్ వాసులకు భారతీయులు దీపావళి సంబరాల రుచి చూపించారు.

శనివారంనాడు ఆక్లాండ్‌లో వేలాది మంది భారతీయులు దీపావళి వేడుకలను జరుపుకున్నారు. రెండు రోజుల సంబరాల్లో భాగంగా దీపాలు వెలిగించారు, నృత్యాలు చేశారు, పాటలు పాడారు, విందు భోజనాలు చేశారు.

Early Diwali for Indians in New Zealand

పిల్లలు, పెద్దలు వేడుకల్లో పాలు పాంచుకున్నారని ఫెయిర్ ఫాక్స్ మీడియా ఎన్‌జడ్ రిపోర్టు చేసింది. వేడుకల్లో పాల్గొన్నవారిలో 2012 న్యూజిలాండ్ గాట్ టాలెంట్ ఫైనలిస్టు డానే మోయికే కూడా ఉన్నారు.

విభిన్నమైనవాటిని చూస్తున్నానని, సంగీతమూ డ్రమ్స్ వినడానికి ప్రయత్నిస్తున్నానని మోయికే అన్నారు. చాలా బాగుందని, ఈ సంస్కృతి తనను దిగ్భ్రమకు గురి చేసిందని, ఇటువంటిది తాను ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు.

English summary
Indian-origin people celebrated Diwali in New Zealand's largest city Auckland days ahead of its actual date giving New Zealanders a taste of Indian culture.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X