వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈటల నరనరాన స్వార్థమే.. అందుకే బీజేపీలో చేరిక - అనిల్ కూర్మాచలం

|
Google Oneindia TeluguNews

ఈటల రాజేందర్‌పై ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ విరుచుకుపడింది. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏదైనా పార్టీలో చేరొచ్చని.. ఈటల రాజేందర్ కూడా చేరొచ్చునని.. కానీ అక్కడి నాయకుల మెప్పు కోసం రాజకీయ జీవితమిచ్చిన పార్టీని , కేసీఆర్ని విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎన్నారై టి.ఆర్.యస్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కూర్మాచలం స్పష్టంచేశారు.

కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కరోనా సమయంలో ప్రజలను గాలికి వదిలేసి, కట్టడిలో విఫలమైన సంగతి తెలిసిందే. దీనిని ప్రపంచమంతా విమర్శించిస్తుంటే, ప్రజలు ప్రధానమంత్రి రాజీనామాను కోరుతున్నారని గుర్తుచేశారు. కానీ మీకేమో బీజేపీ గొప్పగా కనబడడమేంటో విచిత్రంగా ఉందన్నారు. స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం.. వ్యక్తిగత ఆస్తుల రక్షణ కోసం పార్టీలో చేరారని తెలిపారు.

 etela rajender is selfish: anil

కానీ ఢిల్లీలో ఎంతటి ఆత్మగౌరవం లభించిందో ప్రజలంతా గమినించారని, మంత్రులని, ఎమ్మల్యేలని ఆత్మవిమర్శ చేసుకోమనడం కాదు.. ఢిల్లీ పోయి వచ్చాక ఆలోచించాలని కోరారు. దేశం లో ప్రాంతీయ పార్టీలు పుట్టిందే ఢిల్లీ పార్టీలు వివక్ష చూపిస్తున్నారని.. ఆత్మగౌరవం దక్కడం లేదనే, కానీ ఆత్మగౌరవం కోసం ఢిల్లీ పార్టీలో చేరడం విడ్డురంగా ఉందని అనిల్ కూర్మాచలం తెలిపారు.

ఉద్యమకారులకు అవకాశం రావడం లేదని విమర్శించడం, పదవులు అనుభవించి ఈ రోజు అదే పార్టీ నాశనం కోరుకోవడం మానవత్వం లేని వ్యక్తిత్వానికి నిదర్శనమని ఫైరయ్యారు. వ్యక్తిగతంగా సమస్యలుంటే పార్టీ నాయకత్వంతో చూసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రజలు, హుజురాబాద్ ప్రజలు ఈటల రాజేందర్ మాటలని నమ్మే పరిస్థితిలో లేరని, తన స్వార్థం కోసం బీజేపీలో చేరారని, తన ఆస్తులని కాపాడుకోవడం కోసమే ఢిల్లీ పార్టీ అండను కోరుకున్నారని, కానీ ప్రజలు మాత్రం సరైన సందర్భం లో తగిన బుద్ది చెప్తారని తెలిపారు.

కేసీఆర్‌కు హుజురాబాద్ పై ప్రత్యేక ప్రేమ ఉందని, రైతు బంధు పథకాన్ని ప్రారంభించిందే హుజురాబాద్ లోనని, అంతటి గౌరవం హుజురాబాద్ అంటే అని అనిల్ తెలిపారు.

English summary
ex minister etela rajender is selfish nri trs leader anil kurmachalam said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X