వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా చెరలో ఫార్మింగ్ టన్ విద్యార్థుల వెతలు అన్నీ .. ఇన్నీ కావు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : దేశం కానీ దేశంలో .. ఉన్నత విద్య కోసం ఆ విద్యార్థులు పడరాని పాట్లు పడ్డారు. పీజీ కోర్సు చేశాక కూడా హెచ్ 1 బీ వీసా రాకపోవడంతో ఫార్మింగ్ టన్ యూనివర్సిటీలో ఆన్ లైన్ కోర్సులో చేరారు. అదే వారి పాలిట శాపమైంది. ఆ తర్వాత వారి జీవితం అమెరికా జైలుకు చేరింది. మీరు చేసింది తప్పన్నారు. మాకు వీసా వద్దు వెళ్లిపోతామని చెప్పినా వినలేదన్నారు ఆ విద్యార్థులు. ఎట్టకేలకు ముగ్గురు విద్యార్థులు శని, ఆదివారం ఒక స్టూడెంట్ హైదరాబాద్ కు చేరుకున్నారు. అగ్ర రాజ్యంలో తమ ఇబ్బందులు తలచుకొని .. ఆగ్రహం వ్యక్తంచేశారు.

వచ్చి రావడంతో .. అరెస్ట్ చేశారు ..

వచ్చి రావడంతో .. అరెస్ట్ చేశారు ..

గదిలో ఉన్న మా వద్దకు పోలీసులు వచ్చి .. అరెస్ట్ చేస్తున్నామని చెప్పడంతో షాక్ కు గురయ్యామని విద్యార్థులు చెప్తున్నారు. ఎందుకని ప్రశ్నిస్తే నిబంధనలకు విరుద్ధంగా నకిలీ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాని చెప్పారు. దాంతో బిత్తరపోవడం మా వంతైందని వాపోయారు. అక్కడినుంచి నిర్భంద కేంద్రానికి తరలించి 30 రోజులు ఉంచారని గుర్తుచేసుకున్నారు. అరెస్ట్ చేసిన వెంటనే తాము భారత్ .. వెళ్లిపోతామని చెప్పినా .. వినలేదని బోరుమన్నారు.

అమెరికాలో ఆన్ లైన్ కోర్సులు సాధారణం

అమెరికాలో ఆన్ లైన్ కోర్సులు సాధారణం

అమెరికాలో ఆన్ లైన్ కోర్సులు రెగ్యులర్ గా చేస్తుంటారు. అలాగే తాము ఫార్మింగ్ టన్ వర్సిటీలో చేరామని చెప్తున్నారు ఓ విద్యార్థి. తొలుత ఎంఎస్ .. తర్వాత ఓపీటీ పూర్తయిన హెచ్ 1 బీ వీసా రాలేదని .. అందుకోసమే ఫార్మింగ్ టన్ వర్సిటీలో ఆన్ లైన్ కోర్సులో చేరామన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలానికి చెందిన ఓ కుటుంబం హైదరాబాద్ లో స్థిరపడింది. ఆయన తండ్రి కాంట్రాక్టర్. హైదరాబాద్ లో కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ పూర్తి చేసి మూడేళ్ల క్రితం ఆ విద్యార్థి అమెరికా వెళ్లాడు. అక్కడ ఎంబీఏ చేసిన .. హెచ్ 1 బీ వీసా రాలేదు. ఇక చేసేదిలేక ఆన్ లైన్ కోర్సులో చేరానని చెప్పాడు. తమను నిర్బంద కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందికి గురిచేయలేదని మరో విద్యార్థి తెలిపాడు. ఆరోగ్యం బాగాలేదని చెబితే చికిత్స చేయించారని గుర్తుచేశారు. నిర్బంద కేంద్రాల నుంచి నేరుగా విమానాశ్రయం తరలించారని మరో విద్యార్థి వెల్లడించారు. అరెస్గైన తర్వాత ఇండియా వెళ్తామంటే ఒప్పుకోలేదని .. న్యాయమూర్తి విచారణ తర్వాతే స్వదేశం వెళ్లేందుకు అంగీకరించారని పేర్కొన్నారు.

ఏపీఎన్ఆర్టీ సాయం మరువం

ఏపీఎన్ఆర్టీ సాయం మరువం

అమెరికా నిర్బంధ కేంద్రాల్లో చిక్కిన తమ కుమారుడిని స్వదేశం రప్పించడంలో ఏపీఎన్ఆర్టీ సాయం మరువలేమన్నారు నెల్లూరు విద్యార్థి తండ్రి. ఆ న్యాయవాదుల సాయంతో బయటకొచ్చారని .. వారు చేసిన మేలును ఎన్నటికీ మరువలేమని పేర్కొన్నారు.

English summary
After the PG course, the H1B visa did not given.. we have joined the online course at Farmington University. Their life later came to the American jail. We do not hear the visa go away. Three students finally reached saturday, a student on Sunday. Responding to their difficulties in the america. the students say that the police were coming to us in the room and said they were arrested. Asked why he was studying in fake university, contrary to the rules. Recall that the detention was taken to custody for 30 days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X