వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరుదైన గౌరవం: భారత సంతతి వ్యక్తికి గణత నోబెల్

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌: ఆస్ట్రేలియాలో ఉంటున్న భారత సంతతి వ్యక్తికి ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. ఇండో-ఆస్ట్రేలియన్‌ అయిన గణిత శాస్త్రవేత్త అక్షయ్‌కు ఇంటర్నేషనల్‌ మ్యాథమెటికల్‌ యూనియన్‌ (ఐఎంయూ) గణిత నోబెల్‌ (ఫీల్డ్స్‌ మెడల్‌) ప్రదానం చేసింది.

స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న అక్షయ్‌ గణిత శాస్త్రంలో అనేక అంశాలపై విస్తృత రచనలు చేశారు. అక్షయ్‌తోపాటు మరో ముగ్గురు.. కౌచర్‌ బికర్‌, పీటర్‌ స్కోల్జే, అలెస్పియో ఫిగాలేలకూ ఈ గణిత నోబెల్‌ పురస్కారం దక్కింది. వీరికి బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో నిర్వహించిన కార్యక్రమంలో పురస్కారాలతోపాటు 15 వేల కెనడా డాలర్ల నగదు బహుమతిని ఐఎంయూ అందజేసింది.

గణిత శాస్త్ర రంగంలో విశేష కృషి చేసిన వారికి 'ఫీల్డ్స్‌ మెడల్‌'ను బహుకరిస్తారు. దీన్ని గణిత శాస్త్ర రంగంలో నోబెల్‌గా భావిస్తారు. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఈ అవార్డులను ప్రకటిస్తారు.

Fields Medal: Aussie genius Akshay Venkatesh wins Nobel Prize of mathematics

న్యూఢిల్లీలో జన్మించిన అక్షయ్‌(36) రెండేళ్ల వయసులో తన తల్లిదండ్రులతో కలిసి ఆస్ట్రేలియా, పెర్త్‌కు వెళ్లిపోయారు. ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో మ్యాథ్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అక్షయ్‌కు భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రలంటే చాలా ఇష్టం. ఇప్పటికే గణిత శాస్త్ర రంగంలో చేసిన కృషికి గాను పలు అవార్డులు అందుకున్నారు.

1924 టొరంటోలో జరిగిన మ్యాథ్య్‌ కాంగ్రెస్‌లో భాగంగా కెనడియన్‌ గణితశాస్త్రవేత్త జాన్‌ చార్లెస్‌ ఫీల్డ్‌ అభ్యర్ధన మేరకు 1932లో ఫీల్డ్‌ మెడల్‌ను ఇవ్వడం ప్రారంభించారు. అప్పటి నుంచి గణిత శాస్త్రరంగంలో అపార కృషి చేసిన వారికి ప్రతి నాలుగేళ్లకు ఒకసారి, 40ఏళ్ల లోపువారికే ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు.

English summary
Professor Venkatesh, who graduated from the University of Western Australia aged 16 with honours in pure mathematics, has achieved his subject's highest honour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X