వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

30 లక్షల డాలర్లు చీటింగ్: భారతీయులు అరెస్టు

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని, బ్యాంకులను మోసం చేశారని ఆరోపిస్తూ భారత సంతతికి చెందిన ఐదుగురితో సహా 7గురిని న్యూయార్క్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులకు 30 సంవత్సరాల జైలు శిక్షతో పాటు లక్షల డాలర్ల అపరాధ రుసుం విధిస్తారని అక్కడి న్యాయనిపుణులు అంటున్నారు.

భారత సంతతికి చెందిన జ్యోస్నా కరణ్ (43), ప్రవీణ్ సింగ్ (53), మహేంద్ర ప్రసాద్ (53) అనే ముగ్గురిని కాలిఫోర్నియా నగరంలో అరెస్టు చేశారు. పాల్ సింగ్ (79), సునితా సింగ్ (60), అమెరికాకు చెందిన స్యానీ ఇష్యాక్ (69), మార్టీన్ బహ్రామ్ (42) అనే ఐదుగురిని న్యూ యార్క్ సమీపంలో అరెస్టు చేశారు.

 Five Indian-origin among seven charged in bank fraud in the US

న్యూయార్క్ పోలీసుల కథనం మేరకు ఈ 7గురు వివిధ స్కీంల కింద పలువురి దగ్గర నగదు వసూలు చేసి వారిని మోసం చేశారు. అదే విధంగా పలు బ్యాంకులలో వీరు నగదు లావాదేవీలు నిర్వహించి మోసం చేశారు.

సుమారు 30 లక్షల డాలర్ల మేరకు బ్యాంకులకు మోసం చేశారని గుర్తించిన పోలీసులు వీరి కోసం గాలించారు. చివరికి అందరిని అరెస్టు చేశారు. నిందితులు నేరం చేసినట్లు వెలుగు చూసిందని, వీరికి కోర్టులో 30 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని న్యాయనిపుణులు అంటున్నారు.

English summary
Five Indian-origin persons are among seven charged with conspiring to commit bank fraud in the US through a scheme that resulted in losses of over USD three million to the victims.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X