వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాలిఫోర్నియాలో వరుస చైన్ స్నాచింగ్ ఘటనలు: పోలీసుల హెచ్చరిక!

|
Google Oneindia TeluguNews

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా పరిధిలో ఉన్న ఫ్రిమోంట్ లో వరుస చైన్ స్నాచింగ్ ఘటనలు స్థానిక భారతీయులను కలవరపెడుతున్నాయి. నెల వ్యవధిలోనే దాదాపు ఆరు చైన్ స్నాచింగ్ ఘటనలు జరగడం గమనార్హం.అయితే ఈ చైన్ స్నాచింగ్ ఘటనల వెనుక ఉన్నది ఒకే నిందితుడా? అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.

వరుస చైన్ స్నాచింగ్ ఘటనల నేపథ్యంలో శుక్రవారం స్థానిక పోలీసులు అనుమానితుడి ఫోటోలను విడుదల చేశారు. ఫోటోల్లో ఉన్నఅనుమానితుడు మే 8వ తేదీ మధ్యాహ్నాం 1.40గం.కి ఆలివ్ ఎరా ఎలిమెంటరీ స్కూల్ వద్ద ఓ మహిళ మెడలోని బంగారు చైన్ లాక్కెళ్లినట్టుగా అనుమానిస్తున్నారు.

Fremont Police Warn Of String Of Chain Snatching Robberies

ఎలిమెంటరీ స్కూల్స్ వద్ద నుంచి నడుచుకుంటూ వెళ్లే మహిళలనే ఎక్కువగా టార్గెట్ చేయడం.. వరుస చైన్ స్నాచింగ్ ఘటనల్లో నిందితుడు ఒకరే అయి ఉంటాడా అన్న అనుమానాలకు ఊతమిస్తోంది. చైన్ స్నాచింగ్ ఘటనలో గాయపడ్డ ఓ మహిళ.. నిందితుడికి 20ఏళ్ల వయసు, 5.8అడుగుల నుంచి 5.10అడుగుల ఎత్తు ఉంటాడని తెలిపింది.

పెట్రోల్ బంక్ వద్ద కారులో పెట్రోల్ కొట్టిస్తున్న సందర్భంలో నిందితుడు ఆమె మెడలో నుంచి చైన్ లాక్కెళ్లాడు. ఆమెను కింద పడేసి మరీ చైన్ లాక్కెళ్లిన దృశ్యాలు సీసీటీవి ఫుటేజీలో రికార్డయ్యాయి. నిందితుడు నలుపురంగు బేస్ బాల్ టోపీ, నలుపురంగు స్వెటర్ ధరించినట్టు గుర్తించారు.

మే 1వ తేదీ నుంచి ఇప్పటివరకు ఇలాంటి చైన్ స్నాచింగ్ ఘటనలు ఆరు జరిగినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనల్లో మహిళలకు స్వల్ప గాయాలు కూడా అయ్యాయని పేర్కొన్నారు.

కాగా, ఇండియా నుంచి అమెరికా వెళ్లే భారతీయ స్త్రీలే చైన్ స్నాచింగ్ ఘటనల్లో ఎక్కువ శాతం బాధితులు. మెడలో మంగళసూత్రం, ఇతరత్రా వంటి ఆభరణాలు ధరిస్తుండటంతో.. దుండగులు దోపిడీలకు పాల్పడుతున్నారు.

English summary
Police released photos of a suspect Friday in an effort to identify the person who allegedly snatched a gold chain from a woman last week, one of six similar robberies in Fremont since the beginning of the month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X