వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో సంగీత కోర్సులకు ఆదరణ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

డల్లాస్: అమెరికాలోని తెలుగు చిన్నారులు, యువతకు శాస్త్రీయ సంగీతాన్ని అందించేందుకు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా గత శనివారం డల్లాస్‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది.

అక్టోబర్ 19న తానా పూర్వ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర, సౌత్‌వెస్ట్ రీజియన్ కో-ఆర్డినేటర్ డాక్టర్ రాజేష్ అడుసుమిల్లి, సంగీత అధ్యాపకులు మీనాక్షి అనిపిండిలు అధికారికంగా తానా-పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం సంగీత కోర్సును ఫ్రిస్కోలోని శ్రీ షిర్డీసాయి సన్నిధిలో ప్రారంభించారు. ఈ కోర్సుకు అమెరికాలోని పిల్లలు, వారి తల్లిదండ్రుల నుంచి భారీ స్పందన వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.

తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలతోపాటు భాషను భావితరాలకు అందించాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమని, తానా చరిత్రలో ఇది ఒక గొప్ప మైలురాయి అని తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని అన్నారు.

ఈ సందర్భంగా తానా పూర్వ అధ్యక్షుడు, తానా-పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సంగీత కోర్స్ ఛైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. సంగీతం నేర్చుకోవాలని కోరుకునేవారికి ఇది ఒక గొప్ప అవకాశమని చెప్పారు. ఇక్కడ కర్ణాటక సంగీతం నేర్చుకున్న వారికి భారతదేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల నుంచి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. రెండేళ్ల ఈ సంగీత కోర్సు అనంతరం పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు పరీక్షలు నిర్వహించి సర్టిఫికేట్లు ప్రదానం చేస్తారని తెలిపారు.

అమెరికాలో అందిస్తున్న ఈ సంగీత కోర్సుకు కో ఆర్డినేటర్‌గా సంగీత అధ్యాపకురాలు మీనాక్షి అనిపిండి వ్యవహరిస్తారని, అమెరికాలోని అన్ని ప్రముఖ నగరాల్లో ఈ కోర్సును అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ కోర్సుకు సంబంధించిన ఇతర వివరాల కోసం www.TANA.org వెబ్‌సైట్‌ను సంప్రదించాలని రాజేష్ అడుసుమిల్లి కోరారు. ఇలాంటి గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మీనాక్షి విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా పలు అన్నమాచార్య గీతాలను సుస్వర అకాడమీ ఆఫ్ మ్యూజిక్ వారు ఆలపించారు. ప్రముఖ సంగీత కళాకారులు పారుపల్లి సత్యనారాయణ, పారుపల్లి బాలసుబ్రహ్మణ్యం, సీతా జయంత్ అన్నమాచార్య గీతాలను వినిపించారు. సుస్వర అకాడమీ విద్యార్థి హరీష్ యార్లగడ్డ పలు గీతాలను ఆలపించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో తానా సభ్యులు శ్రీకాంత్ పోలవరపు, చాల కొండ్రకుంట, కమ్యూనిటీ ప్రముఖులు సిఆర్ రావు, డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, వెంకట్ ములుకుంట్ల, నసీమ్ షేక్, పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

తానా

తానా

అమెరికాలోని తెలుగు చిన్నారులు, యువతకు శాస్త్రీయ సంగీతాన్ని అందించేందుకు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా గత శనివారం డల్లాస్‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది.

తానా

తానా

అక్టోబర్ 19న తానా పూర్వ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర, సౌత్‌వెస్ట్ రీజియన్ కో-ఆర్డినేటర్ డాక్టర్ రాజేష్ అడుసుమిల్లి, సంగీత అధ్యాపకులు మీనాక్షి అనిపిండిలు అధికారికంగా తానా-పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం సంగీత కోర్సును ఫ్రిస్కోలోని శ్రీ షిర్డీసాయి సన్నిధిలో ప్రారంభించారు.

తానా

తానా

ఈ కోర్సుకు అమెరికాలోని పిల్లలు, వారి తల్లిదండ్రుల నుంచి భారీ స్పందన వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.

తానా

తానా

తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలతోపాటు భాషను భావితరాలకు అందించాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమని, తానా చరిత్రలో ఇది ఒక గొప్ప మైలురాయి అని తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని అన్నారు.

తానా

తానా

ఈ సందర్భంగా తానా పూర్వ అధ్యక్షుడు, తానా-పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సంగీత కోర్స్ ఛైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. సంగీతం నేర్చుకోవాలని కోరుకునేవారికి ఇది ఒక గొప్ప అవకాశమని చెప్పారు.

English summary
Telugu Association of North America (TANA) has strived hard to bring such exquisite Indian classical music closer to the younger generation of kids growing up in USA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X