వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినారెకి సాహిత్య నివాళులు: టాంటెక్స్-119 తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు..

శ్రీమతి కిరణ్మయి వేముల వటపత్ర సాయికి, శ్రీ లెనిన్ వేముల వందేమాతరం, చిత్రం భళారే చిచిత్రం, డా.ఉమాదేవి బళ్లూరి.

|
Google Oneindia TeluguNews

జూన్ 18 ఆదివారం 2017 డాలస్ టెక్సాస్. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సాహిత్య వేదిక సమర్పించిన నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు ఈ ఆదివారం జూన్ 18 న సాహిత్య వేదిక సమనవయకర్త శ్రీమతి శారద సింగిరెడ్డి అధ్య క్షతన ఘనంగా నిర్వహించబడ్డంది.

ప్రవాసంలో నిరాటంకంగా 119 నెలలుపాటున ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ యొక్క విశేషం. సినీ వినీలాకాశంలో ఒక ధృవతారగా నిలిచిన ప్రపంచ ప్రఖ్యా త కవి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా.సి.నారాయణ రెడ్డి గారికి టాంటెక్స్ కార్యవర్గ సభ్యులు సాహిత్య వేదిక సభ్యులు, డాల్లస్ ప్రాంతీయ భాషాభిమానులు, సాహిత్య ప్రియులు, అధిక సంఖ్యంలో అత్యంత ఆసక్తితో పాల్గొని పుష్ప నివాళులులు సమర్పించారు.

great tribute to singireddy narayanareddy in texas

డా.సి.నారాయణరెడ్డి గారిని స్మరించుకోవడం కార్యక్రమంలో ప్రత్యేక అంశంగా నిలిచింది. తర్వాత శ్రీమతి స్వాతి బృందం పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య రచించిన 'చక్కని తల్లికి చాంగు భళా', 'నారాయణతే నమో నమో' వంటి కీర్తనలు ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అటు తర్వాత డా.సి.నారాయణరెడ్డి గారు రచించిన 'కర్పూర వసంతరాయలు' గ్రంథాన్ని విశ్లేషిస్తూ శ్రీ రమణ జువ్వాడి ప్రసంగించారు. ఆనాటి రాజైన కుమార వీరారెడ్డి రాజనర్తకి, 'లకుమాదేవి'ని చూసి సమ్మోహితుడై ఆమెపై కవితలల్లిన తీరును చాలా చక్కగా వివరించారు. అంతేకాక 'కర్పూర వసంత రాయలు' గ్రంథంలో సినారె కేవలం సాహిత్యమే కాక వారి నాట్యశాస్త్ర పరిజ్ఞానాన్ని కూడా వివరించారు.

great tribute to singireddy narayanareddy in texas

అటు తర్వాత శ్రీపూదురు జగదీస్వరన్ 'యవ్వని పద్యాలు ముత్యాలు రాలంగ..' అని 'సినారె భళి భళారే విశ్వంభర కీర్తితో' అని తమ స్వీయ రచనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇంతేకాక వారి మిత్రులు శ్రీనక్తారాజు రచించిన 'ఆయిత బాహువుల్ సహజమైనటువంటి మంద హాసముల్' అనే గద్య పద్యాన్ని పాడి వినిపించారు. దాన వీర శూర కర్ణ చలన చిత్రంలోన సినారె వ్రాసిన దుర్యోదునుని సంభాషణలను కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో తమ స్వీయ రచనలతో శ్రీ టి.వరదయ్య ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

డా.ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి సినారె కవితా సంపుటి 'నా రణం మరణం పైనే' మొదటి ప్రతిని సినారె చేతుల మీదుగా అందుకున్న అనుభవాన్ని ప్రేక్షకులతో పంచుకోవడమే కాక, 'పంచకట్టులోన ప్రపంచాన మొనగాడు.. ఎవరయ్య ఇంకెవరు మన తెలుగువాడు' వంటి పద్యాలను స్వయంగా పాడి వినిపించారు. శ్రీ చంద్రహాస్ మద్దుకూరి, 'పాటలో ఏముంది నా మాటలో ఏముంది' అనే సినారె వ్రాసిన పుస్తకాన్ని పరిచయం చేసి 'పాటో బయోగ్రఫీ' అనే పదాన్ని చక్కగా విశ్లేషించారు.

great tribute to singireddy narayanareddy in texas

శ్రీమతి కిరణ్మయి వేముల వటపత్ర సాయికి, శ్రీ లెనిన్ వేముల వందేమాతరం, చిత్రం భళారే చిచిత్రం, డా.ఉమాదేవి బళ్లూరి. 'చదువురాని వాడనని' వగలరాణివి నీవె, చెలికాడు నిన్నే' వంటి సినారె చలన చిత్ర గీతాలను కలిపి స్వీయ కవిత ఆలపించి కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు.

ఇక కార్యక్రమంలో అన్నింటికన్నా ముఖ్య ఘట్టానికొస్తే.. శ్రీ సబ్బని లక్ష్మీనారాయణ 119వ సాహిత్య సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసి 'ఆధునిక తెలుగు కవిత్వంలో లఘు కవితా ప్రక్రియలు' అనే అంశం విశ్లేషిస్తూ ప్రసంగించారు. వీరు వృత్తి రీత్యా ఉపాధ్యాయులు అయినప్పటికీ ప్రవృత్తి రీత్యా సమాజ సేవకుడిగా, పర్యావరణవేత్తగా, సంపాదకులుగా, శరత్ సాహితీ కళా స్రవంతి' తెలంగాణ సాహిత్య వేదిక స్థాపకులుగా ప్రఖ్యాతి చెందారు.

great tribute to singireddy narayanareddy in texas

'ఏది చెప్పినా బతుకు సత్యానలే చెప్పాలి' అనే నమ్మే వీరి రచనలు కథా సంపుటి, కవితా సంపుటిగా సబ్బని పబ్లికేషన్స్ ద్వారా ముద్రితమయ్యాయి. అంతేకాక ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, శేషేంద్ర స్మారక పురస్కారం వంటి ఎన్నో పురస్కారాలు వీరిని వరించాయి. వీరి భాషా ప్రావీణ్యం, తెలుగు భాషకు గణిత శాస్త్రానికి గల సంబంధాలను, ఒక కవిత ఎలా ఉండాలి, ఎన్ని అక్షరాలు ఉండాలి.. అలాగే హైకూలు, నానోలు, వంటి వాటిలోని లక్షణాలను చాలా చక్కగా వివరించారు. కొత్తగా కవితలు రాయాలనుకునేవారికి కూడా ఇది చక్కని శిక్షణలా అనిపించింది.

ముఖ్య అతిథి ప్రసంగానంతరం ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీ కృష్ణారెడ్డి ఉప్పలపాటి, కార్యవర్గ సభ్యులు తదితరులు ముఖ్య అతిథి శ్రీ సబ్బని లక్ష్మీనారాయణ రచించిన 'అక్షరాణువులు' పుస్తక ఆవిష్కరణ తర్వాత వారిని దుశ్శాలువాతో సన్మానించి జ్ఞాపికను బహూకరించారు.

English summary
Sri Sabbani Lakshmi Narayana ​was the chief guest of the event.​The event ​was success​ful​ and ​w​as ​well received ​byall Telugu community living in and around ​Dallas​​ & Fort Worth Metroplex.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X