వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండో స్థానం మనదే: 46వేల మందికి అమెరికా శాశ్వత పౌరసత్వం

|
Google Oneindia TeluguNews

Recommended Video

US citizenship : 46,000 Indians Got, Indians 2nd Largest Group

ముంబై: అమెరికాలో రెండో అతిపెద్ద కమ్యూనిటీగా భారతీయులు రికార్డుల్లోకి ఎక్కారు. తాజాగా, దాదాపు 46,100 మంది భారతీయులకు అమెరికా శాశ్వత పౌరసత్వం లభించడమే ఇందుకు కారణం. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్) ఈ మేరకు శాశ్వత సభ్యత్వం వివరాలను వెల్లడించింది.

లైంగిక వేధింపులు: అలస్కా ఎయిర్‌లైన్స్ తీరుపై జుకర్‌బర్గ్ సోదరి ఆగ్రహంలైంగిక వేధింపులు: అలస్కా ఎయిర్‌లైన్స్ తీరుపై జుకర్‌బర్గ్ సోదరి ఆగ్రహం

అక్టోబర్ 1, 2015 నుంచి సెప్టెంబర్ 30, 2016 వరకు అమెరికా ప్రభుత్వం మొత్తం 7.53లక్షల మంది వ్యక్తులకు యూఎస్ పౌరసత్వాన్ని ఇచ్చింది. వారిలో ఆరుశాతం భారతీయులు ఉన్నారు.

 రెండో స్థానం మనదే

రెండో స్థానం మనదే

అత్యధిక సంఖ్యలో యూఎస్ పౌరసత్వాన్ని అందుకున్న వారిలో మెక్సికన్లు ఉండటం గమనార్హం. వీరి తర్వాత భారతీయులే ఉండటం గమనార్హం. అయితే, మెక్సికో నుంచి వచ్చిన వారికి పౌరసత్వం ఇచ్చే సంఖ్య ప్రతి ఏడాది తగ్గుతోంది.

గత ఏడాది పెరిగిన దరఖాస్తులు

గత ఏడాది పెరిగిన దరఖాస్తులు

2015తో పోల్చుకుంటే గత సంవత్సరం పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 24శాతం పెరిగినట్లు డీహెచ్ఎస్ తెలిపింది. 2015లో శాశ్వత పౌరసత్వం కోసం 7.83లక్షల దరఖాస్తులు రాగా, 2016లో 9.72లక్షల దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించింది.

 ప్రత్యేక హక్కులు

ప్రత్యేక హక్కులు

సాధారణంగా గ్రీన్ కార్డు ఉన్న వారికి మాత్రమే యూఎస్ పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది. దీని వల్ల అమెరికాలో సుదీర్ఘకాలంపాటు నివాసం ఉండవచ్చు. కాగా, పౌరసత్వం లభించని వారికి కొన్ని హక్కులను కల్పించడం జరుగుతుంది. అక్కడి ఎన్నికల్లో ఓటు వేసే హక్కుతోపాటు ఉద్యోగ అవకాశాల్లో వీరికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని ఏసియన్ అమెరికన్ అడ్వాన్సింగ్ జస్టిస్ అధ్యక్షుడు జాన్ సి యాంగ్ తెలిపారు.

 భారీగా పెరిగిన పెండింగ్ దరఖాస్తులు

భారీగా పెరిగిన పెండింగ్ దరఖాస్తులు

న్యూ అమెరికన్ జాతీయ విభాగం నివేదిక ప్రకారం గత రెండేళ్లలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు 77శాతం పెరిగాయి. 2017 జూన్ చివరి నాటికి 7.08లక్షల దరఖాస్తులు పౌరసత్వం కోసం వేచివుండటం గమనార్హం. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వీసా, విదేశీ విధానాలను కఠినతరం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెండింగ్ జాబితా పెరిగినట్లు తెలుస్తోంది.

English summary
India's love affair with the US and the American dream continues unabated, with Indians being the second largest group to have obtained US citizenship during 2016.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X