వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాటా తెలుగు మహాసభలకు భారీ ఏర్పాట్లు

|
Google Oneindia TeluguNews

డల్లాస్: తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుకొమ్మ అయిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాటా) వచ్చే మే 27-29వ వరకు జరిగే ‘డల్లాస్ తెలుగు మహాసభ'లకు ఏర్పాట్లు కనీ వినీ ఎరుగని రీతిలో ముమ్మరంగా సాగుతున్నాయి. తెలుగు మహాసభలు జరిగే చోటు డల్లాస్ మహా నగరం కావడం, అమెరికా, కెనడా నుండే గాక, ఇండియా నుండి కూడా విశేష సంఖ్యలో ప్రేక్షకులు తరిలి వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అందుకు తగ్గ భారీ ఏర్పాట్లు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ఎక్కడా రాజీ పడకుండా వేలాదిగా తరలి వచ్చే ప్రజలకు ఇసుమంతైనా అసౌకర్యం కలగకుండా ఏర్పా ట్లలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ కార్యకర్తలు ఇప్పటినుండే చక్కని ప్రణాళికలతో రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్నారని నిర్వాహకులు తెలిపారు.

డల్లాస్ నగరం నడిబొడ్డున అతిపెద్దదైన డల్లాస్ కన్వెన్షన్ సెంటర్‌లో 10వేల మందికిపైగా కూర్చొనే సామర్ధ్యం, ప్రపంచంలోనే అతిపెద్ద హెలిపాడ్ సౌకర్యం, 105 మీటింగ్ రూంలు, దానికి ఆనుకొని ఉండే 1000 రూంలు గల ఓమ్నీ హోటల్, ప్రక్కనే హైట్ట్ హోటల్, ఫైవ్ స్టార్ట్ వసతి సౌకర్యాలున్నాయని తెలిపారు.

 Heavy Arrangements of Dallas Telugu Maha Sabhalu

అందరికీ అందుబాటులో ఉండే లొకేషన్, చక్కటి పార్కింగ్ సదుపాయం, ఇలా ఒకటేమిటి సమస్త సదుపాయాలు గల డల్లాస్ కన్వెన్షన్ సెంటర్ తెలుగు మహాసభలకు సిద్ధమవుతోందని తెలిపారు. వేలమంది హాజరయ్యే ఈ కార్యక్రమానికి సాంస్కృతిక కార్యక్రమాల రూపకల్పనలో ప్రత్యేక శ్రద్ధను డల్లాస్ కన్వెన్షన్ టీం తీసుకొంటోందని తెలిపారు.

అత్యుత్తమ కార్యక్రమాల ఎంపిక కోసం ప్రత్యేక కమిటీలు నియమించినట్లు తెలిపారు. కార్యక్రమాలలో నాణ్యతకు పెద్దపీట వేసి తెలుగు సంస్కృతి సంప్రదాయాలనే ఆత్మలుగా చేసి కార్యక్రమాలు రూపొందించవలసిందిగా ప్రత్యేక సూచనలు చేయడం జరిగిందని చెప్పారు. కార్యకర్తలలో నూతన ఉత్సాహం నింపడానికి డల్లాస్‌లో అన్ని ప్రముఖ తెలుగు సంస్థల ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.

English summary
Heavy Arrangements has been done for Dallas Telugu Maha Sabhalu by NATA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X