వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లండన్‌లో ఘనంగా వినాయక నిమజ్జనం(ఫొటోలు)

|
Google Oneindia TeluguNews

లండన్: హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్(హెచ్‌వైఎఫ్‌వై) లండన్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు జరిగాయి. భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన అనంతరం వినాయక నిమజ్జనం కూడా ఘనంగా నిర్వహించారు.

భారీ ఎత్తున లండన్ వీధుల్లో నృత్యాలతో నిమజ్జన కార్యక్రమం సాగింది. ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన కుటుంబాలు పాల్గొని, ఆట పాటలతో సంబరాలు చేశారు.

Hyderabad Friends Youth celebrates Vinayaka Chaviti

‘గణపతి బప్పా మోరయా', ‘భారత్ మాతా కి జై' అంటూ లండన్ వీధులు దద్దరిల్లాయి, బ్రిటన్ వాసులు కూడా తరలి వచ్చి ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం.

సంస్థ అధ్యక్షులు దుసరి అశోక్ గౌడ్, సంస్థ ముఖ్య నిర్వాహకులు రత్నాకర్ కడుదుల, నవీన్ రెడ్డి, మల్లా రెడ్డి మాట్లాడుతూ... హైదరాబాద్ ఒక కాస్మోపాలిటన్ ప్రాంతం అని, ఎలాగైతే అక్కడ వివిధ ప్రాంతాల, మతాల ప్రజలు కలిసి మెలిసి ఉంటారో అలాగే ఇక్కడ కూడా అందరిరినీ కలుపుకొని ఈ వేడుకలు జరుపు కోవడం చాల సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన అన్ని సంస్థలకు కృతఙ్ఞతలు తెలిపారు.

Hyderabad Friends Youth celebrates Vinayaka Chaviti

ఎన్నారై టిఆర్ఎస్ అధ్యక్షులు అనిల్ కూర్మాచలం, తెలంగాణా ఎన్నారై ఫోరం(TeNF) అధ్యక్షులు సీకా చంద్ర శేఖర్ గౌడ్, తెలంగాణ ఎన్నారై ఫోరం వైస్ ప్రెసిడెంట్స్ పవిత్ర రెడ్డి కంది, కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు.

వేలంలో తెలంగాణ ఎన్నారై ఫోరం అధ్యక్షులు సీకా చంద్రశేఖర్ గౌడ్ 720 పౌండ్స్‌కి లడ్డూ ప్రసాదం దక్కించుకున్నారు. కార్యక్రమ నిర్వాహకులు, శుష్మన, మనోజ్, సతీష్, సంగి రెడ్డి, గుప్త కసం, ప్రభలత, ప్రీతీ, సుధాకర్, శౌరి, వెంకట్ రెడ్డి, విక్రం రెడ్డి, సుమ, ఉదయ్ నాగరాజు, మధు, రాజ్ బజార్, సత్యం, నరేష్, నగేష్ రెడ్డి, జ్యోతి, మీనా అంతటి, శ్వేతా రెడ్డి, వాణి
తదితరులు పాల్గొన్నారు.

English summary
Hyderabad Friends Youth(HYFY) - London celebrated its consecutive 3rdyear of Ganesh Chathurthi, Ganesh Idol was installed on Sep 17thfollowed by pooja, bhajan and with all traditional rituals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X