వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నారై భర్తలు వదిలేసే తెలుగుమహిళల సంఖ్య పెరుగుతుందట .. తెలుగురాష్ట్రాల నుండే ఎక్కువ ఫిర్యాదులట

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల గురించి కేంద్ర ప్రభుత్వం ఒక ఆందోళనకర విషయాన్ని వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల నుండి విదేశాలకు వెళ్లిన ఎంతో మంది ఎన్నారైలు అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యలను వద్దు పొమ్మంటున్నారట.. ఇటీవల కాలంలో ఎన్నారై భర్తలు వదిలేస్తున్న భార్యల సంఖ్య గణనీయంగా పెరిగిందట.. ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని, ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించడం పై ప్రధాని నరేంద్ర మోడీ కూడా దృష్టి సారించారని చెబుతోంది కేంద్రం.

తల్లిని అత్యంత దారుణంగా రోడ్ మీదకు ఈడ్చి.. పీకపై కాలేసి తొక్కి.. తల నరికి వీరంగం వేసిన కొడుకుతల్లిని అత్యంత దారుణంగా రోడ్ మీదకు ఈడ్చి.. పీకపై కాలేసి తొక్కి.. తల నరికి వీరంగం వేసిన కొడుకు

తెలుగు రాష్ట్రాల్లోని తల్లిదండ్రులు ఆడ పిల్లలకు పెళ్లి చేసే విషయంలో ముఖ్యంగా ఎన్నారై సంబంధం అంటే ఎగిరిగంతేస్తారు. పెళ్లి చేసేందుకు ఎన్ని ఇబ్బందులెదురైనా సరే అమ్మాయి సుఖ పడుతుందని భావించి అప్పులు చేసి మరి పెళ్లి చేసి అబ్బాయితో పంపిస్తారు. అలా పెళ్లి చేసుకున్న వెళ్లిన అన్ని జంటలు కాకున్నా కొన్ని జంటల కాపురం మాత్రం మూన్నాళ్ళ ముచ్చట అవుతుంది. ప్రస్తుతం ఎన్నారై భర్తలు తమను వదిలేశారు అంటూ చాలా మంది మహిళలు ఫిర్యాదు చేయడం ఆందోళన కలిగిస్తోంది.

Increase in number of NRI husbands leaving wives from telugu states

పార్లమెంటు సాక్షిగా విదేశాంగ శాఖ మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్నారైలు తన భర్త తనను వదిలేశారని ఎంతో మంది మహిళలు తమకు ఫిర్యాదులు చేస్తున్నారని అయితే ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా దృష్టి సారించారని పంజాబ్ ఉమెన్ కమిషన్ చైర్ పర్సన్ మనీషా గులాటీ తెలిపారు. ఎన్నారై ల భార్యలు తమకు న్యాయం చేయాలని తమను కోరుతున్నారని, ఇక ఈ నేపథ్యంలో సమస్య తీవ్రతరం కావడంతో ప్రధాని నరేంద్ర మోడీ ని కలిసి మాట్లాడానని అని ఆమె తెలిపారు. సానుకూలంగా స్పందించిన ప్రధాని సమస్య పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పారని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుండి, అందులోనూ ఏపీ నుండి ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు.

అందుకే ఎన్నారైలు అయితే చాలనుకుని పెళ్లిళ్లు చేస్తున్న ఆడపిల్లల తల్లిదండ్రులు, ఇక పెళ్లి చేసుకున్న కొద్ది కాలానికే ఈ భార్యలు మాకు అవసరం లేదంటూ వదిలేస్తున్న ఎన్నారై భర్తలు జాగ్రత్తగా ఉండాలని అర్థమవుతోంది.

English summary
The central government has revealed a serious concern about the Telugu states. Narendra Modi concentrated a srious problem of NRIs. most wives who have married NRIs are leaving thier husbands. The number of NRI husbands leaving their wives has increased substantially in recent years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X