వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాస్త్రవేత్త సంజయ్ రాజారాంకు ప్రతిష్ఠాత్మక పురస్కారం

|
Google Oneindia TeluguNews

India-born scientist named winner of 2014 World Food Prize
న్యూయార్క్: భారతదేశంలో పుట్టి అమెరికాలో స్థిరపడిన ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త సంజయ రాజారాం ప్రతిష్ఠాత్మక ప్రపంచ ఆహార పురస్కారం(అవార్డు)-2014ను గెలుచుకున్నారు. రాజారాం గోధుమ రకాలను సంకరీకరణం చేసి విశిష్ట జన్యు లక్షణాలు గల, అధిక ఉత్పత్తినిచ్చే గోధుమలను సృష్టించారు.

ఆయన అభివృద్ధి చేసిన దాదాపు 480 గోధుమ రకాలను 51 దేశాల్లో విడుదల చేశారు. రాజారాం పరిశోధనల ఫలితంగా హరిత విప్లవం అనంతరం ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల టన్నులకు పైగా గోధుమ ఉత్పత్తి పెరిగింది.

రాజారాం అందించిన సేవలు అనేకమందికి మార్గదర్శకంగా నిలువనున్నాయని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాన్ కెర్రీ అభినందించారు. ఆయన చేసిన పరిశోధలనలను ద్వితీయ హరిత విప్లవంగా పేర్కొనవచ్చని అన్నారు. రాజారాం చేసిన పరిశోధనలకు గుర్తింపుగానే ఈ పురస్కారాన్ని అందిస్తున్నామని, ఈ పురస్కారాన్ని ఆయనకు ప్రకటించడం తమకు చాలా సంతృప్తినిచ్చిందని ప్రపంచ ఆహార పురస్కార వ్యవస్థాపక అధ్యక్షుడు కెన్నెత్ ఎం క్విన్ తెలిపారు.

మనదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన రాజారాం మెక్సికోలో స్థిరపడ్డారు. రూ. కోటి(2,50,000 అమెరికన్ డాలర్లు)కి పైగా విలువైన ఈ పురస్కారాన్ని రాజారాం అక్టోబరులో స్వీకరించనున్నారు.

English summary
India-born plant scientist Sanjaya Rajaram has been named the winner of the USD 250,000 World Food Prize for his contribution in increasing global wheat production by more than 200 million tonnes in the years following the Green Revolution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X