చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జనరల్ మోటార్స్ సీఎఫ్ఓగా భారతీయ అమెరికన్ దివ్య సూర్యదేవర

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రపంచ దిగ్గజ ఆటో కంపెనీల్లో ఒకటైన జనరల్ మోటార్స్ సీఎఫ్ఓగా భారత సంతతికి చెందిన మహిళ దివ్య సూర్యదేవర(39) నియమితులయ్యారు. చెన్నైకి చెందిన దివ్య.. చక్ స్టీవెన్స్ స్థానంలో నియామకమయ్యారు.

సెప్టెంబర్ నుంచి దివ్య జనరల్ మోటార్స్ సీఎఫ్ఓ(చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్) పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ మేరకు జనరల్ మోటార్స్ వెల్లడించింది. గతంలో కీలక పదవుల్లో దివ్య అనుభవం, నాయకత్వం కారణంగా ఆర్థిక కార్యకలాపాల్లో దృఢమైన వ్యాపారాన్ని నిర్మించుకున్నామని కంపెనీ సీఈఓ మేరీ బర్రా తెలిపారు.

Indian-American Dhivya Suryadevara Named GMs CFO

2014 నుంచి జనరల్ మోటార్స్(జీఎం)కు మేరీ బర్రా సీఈఓగా పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే ఆటో పరిశ్రమలో అత్యున్నత పదవులను స్వీకరించిన తొలి మహిళలుగా సీఈఓ మేరీ, సీఎఫ్ఓ దివ్య రికార్డు సృష్టించారు. ఇంతవరకు ఏ ఆటో కంపెనీలోనూ సీఈఓ, సీఎఫ్ఓ పదవుల్లో మహిళలు కొనసాగలేదు.

మద్రాసు యూనివర్సిటీ నుంచి కామర్స్‌లో మాస్టర్ పట్టా పొందిన దివ్య అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీ ద్వారా ఎంబీఏ సాధించారు. 2005లో జనరల్ మోటార్స్ కంపెనీలో దివ్య చేరారు. 2017 నుంచి కార్పొరేట్ ఫైనాన్స్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

English summary
Indian-origin Divya Suryadevara has been appointed as the new Chief Finance Officer for the US-based automaker giant General Motors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X