వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తకు భారీ గ్రాంట్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తకు అరుదైన అవకాశం లభించింది. క్యాన్సర్‌పై అపూర్వ పరిశోధనలు చేపట్టిన సైంటిస్టు నవీన్‌ వరదరాజన్‌కు 11 లక్షల డాలర్ల గ్రాంటు ప్రకటించారు.

భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త వరదరాజన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హుస్టన్‌లో మరో పరిశోధకుడు సంఘ్యూక్‌ ఛుంగ్‌తో కలిసి ప్రాణాంతక క్యాన్సర్‌ విశేష పరిశోధనలు చేపట్టారు. ఈ పరిశోధనలకు గుర్తింపుగా అమెరికాలోని క్యాన్సర్‌ ప్రివెన్షన్‌ అండ్‌ రిసర్ట్‌ ఇనిస్ట్యూట్‌ ఆఫ్‌ టెక్సాస్‌ (సిపిఆర్‌ఐటి) ఈ సహాయ నిధిని మంజూరు చేసింది.

క్యాన్సర్‌ మూల కారణాలు, నివారణ చికిత్సలకు ఈ సంస్థ అమెరికాలో భారీ స్థాయిలో నిధులు సమకూరుస్తోంది. హుస్టన్‌ వర్సిటీలో ఓ బయోమాలిక్యులర్‌ ఇంజనీరింగ్‌ సహాయక ప్రొఫెసర్‌ అయిన వరదరాజన్‌ టి-సెల్‌ ఇమ్యూనోథెరపిలో విస్తృత పరిశోధనలు సాగించేందుకు ఈ నిధులను సమకూర్చారని ప్రకటనలో పేర్కొన్నారు.

English summary
Associate professor of chemical and biomolecular engineering, Navin was given USD 1,173,420 to improve effectiveness of T-cell immunotherapy, while his fellow researcher Sanghyuk Chung, associate professor of biology and biochemistry, was awarded USD 811,617 to define molecular targets for the treatment of cervical cancer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X