వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అమెరికాలో ఇద్దరు భారత సంతతికి చెందిన తల్లి, కొడుకుల హత్య
వాషింగ్టన్: అమెరికాలో భారతీయ సంతతి మహిళను, ఆమె కుమారుడు అనుమానాస్పదస్థితిలో హత్యకు గురయ్యారు. వాష్టింగ్టన్లోని వర్జీనియా సబర్స్లో గుర్తు తెలియని వ్యక్తులు వారిద్దరిని కాల్చి చంపారు.
అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయ సంతతికి చెందిన మాలా మన్వానీ, రిషి మన్వానీని పై తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటనకు సంబంధించి ఓ యువకుడిని పోలీసులు విచారిస్తున్నారు.

ఈ ఘటన జాతి విద్వేష హత్యగా తాము అనుకోవడం లేదని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన దుండగులు ఎవరు, ఎందుకు ఈ ఘటనకు పాల్పడాల్సి వచ్చిందనే విషయమై ఆరా తీస్తున్నారని పోలీసులు తెలిపారు.
ఇంట్లో తల్లి కొడుకులు నిర్జీవంగా పడి ఉన్నారు. శరీరంపై బుల్లెట్ గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. దోషులను అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయని పోలీసులు చెబతున్నారు.