వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారతీయుడిపై దాడి: నిందితుడికి బెయిల్

|
Google Oneindia TeluguNews

Indian assault case
మెల్బోర్న్: భారతీయ విద్యార్థిపై దాడికి పాల్పడిన కేసులో ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేసిన నిందిత యువకుని(16)కి అక్కడి కోర్టు బెయిల్ ఇచ్చింది. పోలీసులకు కేసులో సహకరిస్తున్నందునే అతనికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చినట్లు కోర్టు వెల్లడించింది. సహ నిందితులతో కలవడని, వారికి ఎలాంటి సహాయం చేయడని కోర్టుకు హాజరైన నిందితుడి తల్లిదండ్రులు ఇచ్చిన హామీ మేరకు అతనికి బెయిల్ లభించింది.

భారతీయ విద్యార్థిపై దాడికి పాల్పడిన మరో నిందితుడ్ని(17) పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్న ఒక రోజు తర్వాత తొలుత అరెస్ట్ చేసిన నిందితునికి బెయిల్ లభించింది. కాగా ఆస్ట్రేలియాలో ఇటీవల దుండగులు జరిగిన దాడిలో తీవ్ర గాయాలపాలైన భారతీయ విద్యార్థి మన్రియాజ్విందర్ సింగ్ (20) పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది.

డిసెంబర్ 29న తన స్నేహితుడితో కలిసి మన్రియాజ్విందర్ సింగ్ ఫుట్‌పాత్‌పై నిలబడి ఉండగా, 8 మంది దుండగులు వచ్చి దాడి చేశారు. ఇద్దరినీ కూడా తీవ్రంగా కొట్టి వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లు లాక్కుని వెళ్లారు. ఆ దాడికి సంబంధించి సిసిటివీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు తొలుత ఒక నిందితున్ని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు కూడా పట్టుబడటంతో తొలుత అరెస్ట్ చేసిన నిందితునికి షరతులతో కూడా బెయిల్ ఇవ్వడం జరిగింది.

దుండగులు అఫ్రికావాళ్ల మాదిరిగా ఉన్నారని, ఓ కాకేసియన్ మహిళ కూడా వారిలో ఉందని డిటెక్టివ్ సీనియర్ పోలీసు అధికారి ఇటీవల మీడియాకు తెలిపారు. మన్రియాజ్విందర్ సింగ్ దవడలపై గట్టిగా గుద్దారని, దాంతో వెనక్కి పడిపోయి స్పృహ కోల్పోయాడని చెప్పారు. కిందపడిన తర్వాత కూడా వారు అతన్ని వదిలిపెట్టలేదని, తన్నుతూ కొట్టారని, మహిళ కర్ర తీసుకుని దాడి చేసిందని చెప్పారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మన్రియాజ్విందర్ సింగ్ కోమాలోకి వెళ్లిపోయాడు. మరో స్నేహితునికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

English summary
A teenager, charged with attacking and robbing a 20-year-old Indian student, was granted conditional bail by an Australian court after it was told that the boy was assisting the police in the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X