వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుబాయ్ బ్యాంక్ ఉదారత.. రూ.2 కోట్ల అప్పు, రూ.5 లక్షలకు తగ్గించి.. మరో జన్మ అంటూ...

|
Google Oneindia TeluguNews

బ్యాంకులు ముక్కుపిండి నగదు వసూల్ చేయడమే కాదు అప్పుడప్పుడు ఉదారత కూడా కనబరుస్తాయి. ఓ భారతీయుడు దుబాయ్‌‌లో రుణం తీసుకున్నాడు. తిరిగి కట్టలేకపోయాడు. కానీ అప్పు చాంతాడంతై కూర్చొంది. అతనిపై బ్యాంక్ ఉదారత చూపి.. భారీగా నగదు మాఫీ చేసింది. రూ. కోట్ల అప్పును కేవలం రూ.5 లక్షలు కడితే చాలు అని చెప్పింది. కస్టమర్ ఆపదలో ఉంటే బ్యాంకులు కూడా అర్థం చేసుకుంటాయని దుబాయికి చెందిన ఆర్థిక నిపుణుడు, కార్పొరేట్-కమర్షియల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ గల్ఫ్ లా డైరెక్టర్ బార్నే అల్మజార్ చెబుతున్నారు. ప్రవాస భారతీయుడి రూ. 2 కోట్ల రుణాన్ని బ్యాంకు మాఫీ చేయడమే ఇందుకు ఉదాహరణ అని ఆయన అన్నారు.

2008లో దుబాయ్.. వ్యాపారం

2008లో దుబాయ్.. వ్యాపారం

ఓ భారతీయుడు 2008లో దుబాయ్‌కు వెళ్లాడు. అక్కడ ఓ చిన్న కంపెనీలో క్లర్క్‌గా ఉద్యోగం సంపాదించాడు. వచ్చిన దాంట్లోనే కొంతమొత్తాన్ని కూడబెట్టి 2012లో సొంతంగా ఓ వ్యాపారాన్ని ప్రారంభించాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అతడు వ్యాపారంలో రాణించలేకపోయాడు. అప్పులు పెరిగిపోయాయి. బ్యాంకు ఇచ్చిన క్రెడిట్ కార్డును కూడా వాడేశాడు. క్రెడిట్ కార్డు బిల్లు కూడా కట్టకుండా తప్పించుకుంటూ వచ్చాడు. పోలీసు కేసు కూడా నమోదు కావడంతో ఏం చేయాలో తెలియక ఏడేళ్ల క్రితం మళ్లీ భారత్‌కు వచ్చేశాడు. ఇండియాకు వచ్చి ఏడేళ్లు గడిచినా ఇక్కడ కూడా అతడి పరిస్థితి అలానే ఉంది.

తిరిగి దుబాయ్...

తిరిగి దుబాయ్...

మళ్లీ దుబాయి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. కానీ యూఏఈలో అప్పులు చేసి వచ్చేయడంతో అక్కడి ప్రభుత్వం ఇతడిని యుఏఈ బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. తాను తీసుకున్న క్రెడిట్ కార్డు రుణాన్ని తీర్చకపోవడంతో ఈ ఏడేళ్లలో దాని వడ్డీ పది లక్షల దిర్హామ్‌ (రూ. 2 కోట్లకు పైగా) దాటింది. ఇదే సమయంలో దుబాయిలోని ఆర్థిక నిపుణుడు అల్మజార్‌ను సంప్రదించాడు. తన పరిస్థితి గురించి మొత్తం వివరించాడు. అల్మజార్‌కు అతడి నిజాయితీ, దుబాయికి వచ్చి మళ్లీ వ్యాపారం మొదలు పెట్టాలనుకునే కసి నచ్చి సహాయం చేయాలనుకున్నాడు.

రూ.2 కోట్ల అప్పు.. రూ.5 లక్షలకు సెటిల్

రూ.2 కోట్ల అప్పు.. రూ.5 లక్షలకు సెటిల్


బ్యాంకు సిబ్బందితో మాట్లాడి సదరు భారతీయుడు రూ. 2 కోట్లు కట్టే స్థితిలో లేనని చెప్పాడు. బ్యాంకు సిబ్బంది భారతీయుడి కష్టాలను అర్థం చేసుకుంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఏర్పడ్డ క్లిష్ట పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని.. అతడి అప్పును పది లక్షల దిర్హామ్‌ల నుంచి 25 వేల దిర్హామ్‌ల (రూ. 4.92 లక్షలు)కు తగ్గించింది. దీంతో సదరు భారతీయుడు మళ్లీ దుబాయికి వెళ్లేందుకు మార్గం సుగమమైంది. దుబాయ్ బ్యాంక్ తనకు అవకాశం ఇచ్చి.. మరో జన్మను అందజేసిందని సదరు భారతీయుడు చెబుతున్నాడు.

English summary
indian defaulters with dh 1 million debt works out dh 25000 settlement plan to return to dubai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X