వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లండన్ లో ఘనంగా గణేశ్ నిమజ్జనం చేసిన హైదరాబాద్ యూత్..

|
Google Oneindia TeluguNews

లండన్: రీడింగ్ లో ఘనంగా వినాయక నిమజ్జనం జరిగింది. హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ లండన్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు జరిగాయి. భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన అనంతరం వినాయక నిమజ్జనం కూడా ఘనంగా నిర్వహించారు.

భారీ ఎత్తున రీడింగ్ వీధుల్లో నృత్యాలతో నిమజ్జన కార్యక్రమం సాగింది. ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన కుటుంబాలు పాల్గొని, ఆటపాటలతో సంబరాలు చేశారు.'గణపతి బప్పా మోరయా','భారత్ మాతా కి జై' అంటూ రీడింగ్ వీధులు దద్దరిల్లాయి,

nri youth

బ్రిటన్ వాసులు కూడా తరలి వచ్చి ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం. సంస్థ ముఖ్య నిర్వాహకులు రత్నాకర్కడుదుల, నవీన్ రెడ్డి, మల్లా రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ ఒక కాస్మోపాలిటన్ ప్రాంతం అని, ఎలాగైతే అక్కడ వివిధ ప్రాంతాల, మతాల ప్రజలు కలిసి మెలిసి ఉంటారో అలాగే ఇక్కడ కూడా అందరినీ
కలుపుకొని ఈ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన అందరికి కృతఙ్ఞతలు తెలిపారు.ఈ పూజ కోసం కోసం ప్రత్యేకంగా లడ్డూ తయారు చేసిన లక్ష్మి చిన్నం గారిని నిర్వాహకులు అభినందించడం
జరిగింది. ఎన్నారై టిఆర్ఎస్ అధ్యక్షులు మరియు తెలంగాణా ఎన్నారై ఫోరం ఫౌండర్ మెంబర్ అనిల్ కూర్మాచలం, తెలంగాణ ఎన్నారై ఫోరం వైస్ ప్రెసిడెంట్ పవిత్ర రెడ్డి కంది దంపతులు మరియు
ఇతర సభ్యులు కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. వేలంలో తక్కళ్లపల్లి శ్రీధర్
రావు,దీప్తి దంపతులు 601 ఫ్రెండ్స్‌కి లడ్డూ ప్రసాదం దక్కించుకున్నారు.

కార్యక్రమ నిర్వాహకులు రత్నాకర్ కడుదుల, నవీన్ రెడ్డి, మల్లా రెడ్డి, శుష్మన, రాజు , నాగార్జున ,ధర్మ
, నాగరాజు గరిపెల్లి, సత్య రెడ్డి పింగిలి ,శివ చిన్నం, లక్ష్మి చిన్నం, శివరామా గుప్త , సత్య , అపర్ణ ,వెంకట్ రెడ్డి, విక్రం రెడ్డి, సత్యం,సుమ,శారధ ప్రసాద్ పెండ్యాల, తదితరులు పాల్గొన్నారు.

English summary
We thank all those supported and involved in making our 2016 - HYFY Ganesh Festival celebrations - Grand SUCCESS !!Our Special thanks to Malla Reddy and Shushumana for all their hard work through out the event.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X