వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెళ్లిపోకుంటే మీ పిల్లల్ని చంపేస్తా: భారతీయ దంపతులకు కెనడాలో బెదిరింపులు, అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

Indian Origin Couple in Canada Facing Problems From Canadian

ఒట్టావా: దేశం విడిచి వెళ్లకుంటే మీ పిల్లల్ని చంపేస్తామంటూ కెనడాలో భారతీయ దంపతులను బెదిరించారు. కెనడాకు చెందిన ఓ వ్యక్తి భారతీయ జంటపై జాతి వివక్షతో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఒంటారియాలోని హామిల్టన్‌లో వాల్‌మార్ట్ సూపర్ సెంటర్ పార్కింగ్ స్థలంలో భారత సంతతికి చెందిన దంపతులతో 47 ఏళ్ల డేల్ రాబర్ట్ సన్ వివాదం ఏర్పడింది.

ఈ గొడవలో మాటమాటా పెరిగింది. దీంతో ట్రక్కులో వచ్చిన డేల్ రాబర్ట్ సన్ వారి పైకి ఒక్కసారిగా యాక్సిలరేటర్ పెంచి, ఆ తర్వాత బ్రేక్ వేశాడు. అతను బ్రేక్ వేసిన తర్వాత భారతీయ వ్యక్తి భార్యకు ట్రక్కు తగిలింది.

In hate crime, Indian origin couple in Canada threatened: I will kill your children

నేను నా దేశం వెళ్లాలని కోరుకుంటున్నావా, కానీ నేను కెనడా సిటిజన్‌ను అని రాబర్ట్ సన్‌తో భారతీయ వ్యక్తి అన్నారు. దానికి రాబర్ట్ సన్ స్పందిస్తూ.. నీవు ఇక్కడి వాడివని చెప్పేందుకు ఆధారాలు చూపించాలని, నిన్ను నమ్మేది లేదని, నువ్వు ఇక్కడి వాడిలా మాట్లాడకని అన్నాడు.

నేను జాత్యాహంకరానినని, నాకు నువ్వు నచ్చలేదని, ఆమె (భారతీయుడి భార్య) నచ్చలేదని, ఇక్కడే ఉంటే మీ పిల్లల్ని చంపేస్తానని అతను హెచ్చరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే సదరు భారత సంతతి దంపతుల వివరాలు వెల్లడించలేదు. వారు భారత్ నుంచి వెళ్లి కెనడాలో ఉంటున్నారు. వారికి సిటిజన్‌షిప్ ఉంది. హామిల్టన్ పోలీసులు ఈ జాతి వివక్షపై దర్యాఫ్తు చేస్తున్నారు. రాబర్ట్ సన్‌పై జాతి వివక్ష, బెదిరింపులు, ప్రమాదకర డ్రైవింగ్ తదితర నేరారోపణలతో అరెస్టు చేశారు.

English summary
An Indian origin couple in Canada was harassed by a man on Sunday, who yelled at them to leave the country and threatened to kill their children. The incident took place at the parking lot of Walmart Supercentre in Hamilton, Ontario.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X